లక్ష రూపాయల షావోమీ ఫోన్! స్పెషల్ ఫీచర్లివే!

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తమ లేటెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ షియోమీ 14 అల్ట్రాను లాంఛ్ చేసింది. దీని ధర అక్షరాలా లక్ష రూపాయలు.

Advertisement
Update:2024-03-11 16:30 IST

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తమ లేటెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ షియోమీ 14 అల్ట్రాను లాంఛ్ చేసింది. దీని ధర అక్షరాలా లక్ష రూపాయలు. మరి ఐఫోన్‌తో పోటీ పడేంతగా ఇందులో ఏమేం ఫీచర్లున్నాయో ఇప్పుడు చూద్దాం.

గ్లోబ‌ల్ మార్కెట్‌లో రిలీజ్ చేసిన నెల రోజుల తర్వాత ‘షాయోమీ 14 అల్ట్రా’ మొబైల్ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయింది. ఈ మొబైల్‌ను షావోమీ బ్రాండ్ నుంచి వచ్చిన కాస్ట్లీ ఫోన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 3 ఎస్‌వోసీ చిప్‌సెట్‌ వాడారు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైప‌ర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.73 అంగుళాల ఎల్టీపీవో అమోలెడ్ మైక్రో క‌ర్వ్‌డ్ 4కె డిస్‌ప్లే ఉంటుంది. ఇది3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది.

ఈ మొబైల్ కెమెరాల విషయానికొస్తే.. ఇందులో స‌ర్కుల‌ర్ మాడ్యూల్‌ డిజైన్‌లో నాలుగు కెమెరాలు అమర్చారు. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 900 ప్రైమ‌రీ సెన్సర్‌‌తో పాటు రెండు 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్‌858 సెన్సర్‌‌లు ఉన్నాయి. ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌), 3.2ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్, 5ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్ వంటి ఫీచర్లున్నాయి. అలాగే ముందువైపు 32-మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

షావోమీ 14 అల్ట్రా మొబైల్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాట‌రీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 80 వాట్ వైర్‌లెస్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్‌, గ్లోనాస్‌, నావ్ ఐసీ క‌నెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

షావోమీ 14 అల్ట్రా ధరల విషయానికొస్తే.. 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.99,999 గా ఉంది. ఇందులో 6 జీబీ ర్యామ్ విత్ 1టీబీ స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫోన్ బ్లాక్‌, వైట్ క‌ల‌ర్ ఆప్షన్లలో ల‌భిస్తుంది. ఫోన్ కావాలనుకునే వారు రూ.9,999 చెల్లించి ప్రీ-రిజ‌ర్వ్ చేసుకోవచ్చు. వచ్చే నెల రెండో వారం నుంచి కొనుగోళ్లు మొదలవ్వొచ్చు. అయితే ఈ మొబైల్ పెర్ఫామెన్స్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ షావోమీ బ్రాండ్‌కు లక్ష రూపాయల ధర అనేది కాస్త ఎక్కువ అని టెక్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News