కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? దాన్ని దాటడం ఎలా?

ఎందులోనైనా సక్సెస్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ దాటాలని నిపుణులు చెప్తుంటారు. అయితే అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? దీన్ని దాటడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Update: 2024-08-19 07:36 GMT

ఎందులోనైనా సక్సెస్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ దాటాలని నిపుణులు చెప్తుంటారు. అయితే అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? దీన్ని దాటడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంఫర్ట్ జోన్ అనేది ఒక సెల్ఫ్ సేఫ్ జోన్. ఇందులో వ్యక్తి తనను తాను సేఫ్‌గా ఫీలవుతాడు. ఇందులో ఉన్నంత కాలం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే ఈ జోన్‌లో ఉన్నంతకాలం చెప్పుకోదగ్గ విజయాలు కూడా పెద్దగా ఉండవు. ఎందుకంటే వీళ్లె్ప్పుడు సేఫ్ జోన్ విడిచి బయటకు రాలేదు కాబట్టి. సేఫ్ జోన్‌లోనే ఎక్కువ కాలం ఉంటే తమలో ఉండే కొత్త కోణాన్ని తెలుసుకోలేరు. అందుకే సక్సెస్ కోరుకునే వాళ్లు దీన్ని దాటి తీరాలి.

‘నిజమైన జీవితం కంఫర్ట్ జోన్ చివరలో మొదలవుతుంది’ అంటాడు నీల్ డొనాల్డ్ వాల్ష్. ముందు మార్పుకు సిద్ధమైతే మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. మార్పుకు సిద్ధమవడమే జోన్ దాటి బయటకు రావడం. ప్రతీ మ‌నిషి సౌక‌ర్యవంత‌మైన‌, సెక్యూర్ జీవితాన్ని గ‌డ‌పాల‌ని కోరుకుంటాడు. అయితే అలాంటి జీవితంలో సుఖం ఉంటుంది. కానీ సక్సెస్ ఉండదు. కంఫ‌ర్ట్ జోన్‌లోని విలాసాల‌కు అట్రాక్ట్ అవ్వకుండా ప్రతి క్షణాన్ని ఛాలెంజింగ్‌గా ఎవ‌రు తీసుకుంటారోవారే నిజ‌మైన విజేత‌లుగా నిలుస్తారు.

డేంజ‌ర్ జోన్

చాలామంది చిన్న సౌక‌ర్యాల‌కు అలవాటైపోయి, ఒకే స్థాయిలో ఉండిపోయేందుకు సిద్ధపడతారు. కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి క‌నీస‌ ప్రయ‌త్నం కూడా చేయ‌రు. అందులోంచి బ‌య‌ట‌కు వ‌స్తే ఎలాంటి క‌ష్టాలు పడాల్సొస్తుందో, ప్రస్తుతానికి ఇక్కడ బాగానే ఉంది క‌దా అన్న భావనలో ఉంటారు. ఉదాహరణకి చాలామందికి ఏదైనా బిజినెస్ పెట్టి పెద్ద స్థాయికి ఎదగాలని ఉంటుంది. కానీ దానికోసం ఏలాంటి ప్రయత్నం చేయకుండా ప్రస్తుతానికి ఏదో ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. టైం వచ్చినప్పుడు బిజినెస్‌లోకి దిగుదాం అని వెయిట్ చేస్తుంటారు. ఈలోపు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది. సాధించాలనుకున్న కోరికలన్నీ అలాగే మిగిలిపోతాయి. ఇదే కంఫర్ట్ జోన్‌లో ఉండిపోవడం అంటే.

బయటపడాలంటే..

కంఫర్ట్ జోన్ తెలియకుండానే మనల్ని బద్ధకస్తుల్ని చేస్తుంది. ఆఖరికి లైఫ్ యాంబిషన్‌ను కూడా పక్కకు పెట్టేంతలా సోమరిపోతుల్ని చేస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ముందు మార్పుకు సిద్ధం అవ్వాలి. మనసుని మోటివేషన్‌తో నింపాలి. కొత్త ఐడియాలు, కొత్త డెసిషన్‌లతో మనసుని ఎప్పటికప్పుడు రేస్ కు రెడీ చేయాలి. గెలుపు ఓటముల సంగతి పక్కన పెట్టి ముందు ప్రయత్నం మొదలు పెట్టాలి.

బిజినెస్‌లో సక్సెస్ సాధించడం లక్ష్యం అయితే ముందు ఉద్యోగాన్ని వదిలేసి, సొంతగా పనిచేయడం ఎలాగో ఆలోచించాలి. ఏదైనా ఆటలో లేదా కళలో రాణించాలి అనుకుంటే దాన్నుంచి మనల్ని దూరం పెడుతున్న విషయాలన్నింటిని పక్కన పెట్టాలి. రిస్క్ తీసుకుని అనుకున్న రంగంలోకి అడుగుపెట్టాలి. ఇప్పటి దాకా మనం చేయలేము అనుకున్న పనులను ఓ సారి ట్రై చేసి చూడాలి. అప్పుడే నిజంగా చేయగలమో లేదో తెలుస్తుంది. ట్రై చేద్దాం అనే ఒక్క డెసిషన్ తీసుకోవడమే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం అంటే.

Tags:    
Advertisement

Similar News