బాడీ లాంగ్వేజ్ కోసం అలెగ్జాండర్ టెక్నిక్!
బాడీ లాంగ్వేజ్ అనేది ఎంతో ముఖ్యమైన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్. కానీ మనలో చాలామంది బాడీ లాంగ్వేజ్‌ను అంతగా పట్టించుకోరు. నడిచే విధానం, మాట్లాడే తీరులో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంటర్వ్యూల వంటి వాటిలో ఫెయిల్ అవుతుంటారు.
బాడీ లాంగ్వేజ్ అనేది ఎంతో ముఖ్యమైన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్. కానీ మనలో చాలామంది బాడీ లాంగ్వేజ్‌ను అంతగా పట్టించుకోరు. నడిచే విధానం, మాట్లాడే తీరులో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంటర్వ్యూల వంటి వాటిలో ఫెయిల్ అవుతుంటారు. అయితే అలెగ్జాండర్ టెక్నిక్ ద్వారా బాడీ లాంగ్వేజ్‌ను ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇదెలా ఉంటుందంటే..
అలెగ్జాండర్ టెక్నిక్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అలెగ్జాండర్ అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అలెగ్జాండర్ మాధియాస్ అనే వ్యక్తి 19వ శతాబ్దానికి చెందిన ఒక యాక్టర్. అస్ట్రేలియాకు చెందిన అలెగ్జాండర్.. షేక్‌స్పియర్ నాటకాలు ప్లే చేస్తూ చాలామంచి పేరు సంపాదించాడు. అయితే ఉన్నట్టుండి సడెన్‌గా ఒకరోజు అలెగ్జాండర్ గొంతు మూగబోయింది. ఎంత ట్రై చేసినా నోటిలోంచి మాట బయటకు రాలేదు. దాంతో అతన్ని పరిశీలించిన డాక్టర్లు బాగా అరవడం వల్ల అతని గొంతు కండరాలు దెబ్బతిన్నాయనీ, ఇకపై మాటలు వచ్చే అవకాశం తక్కువేనని తేల్చారు. దాంతో అలెగ్జాండర్ నాటకాలకు దూరం అయ్యాడు.
అద్దం ముందు నిల్చొని..
గొంతు పోవడం అనే ఆలోచన అలెగ్జాండర్‌ను బాగా ఆలోచింపజేసింది. ఒకసారి అద్దం ముందు నిల్చొని తను డైలాగ్‌లు చెప్పే విధానాన్ని చూసుకున్నాడు. అప్పుడు అతనికి మాట్లాడేటప్పుడు తన గొంతుని అనవసరంగా రకరకాలుగా తిప్పుతూ, దాని మీద లేనిపోని ఒత్తిడిని కలుగచేస్తున్నానన్న విషయం అర్థమైంది. ఈ బాడీ లాంగ్వేజ్ మిస్టేక్ వల్లే గొంతు పోగొట్టుకున్నానని తెలుసుకున్నాడు. అప్పటినుంచి గొంతు కండరాల మీద ఒత్తిడిని కలిగించకుండా సులభంగా మాట్లాడ్డం ప్రాక్టీస్ చేశాడు. కొంతకాలానికి అతని టెక్నిక్ సక్సె్స్ అయింది. మాట్లాడే స్టైల్‌ను మార్చి గొంతు కండరాల మీద ఒత్తిడిని తగ్గించడంతో పోయిన గొంతు తిరిగొచ్చేసింది. దాంతో అలెగ్జాండర్ ఇలాంటి బాడీలాంగ్వేజ్ పొరపాట్ల మీద మరింత ఫోకస్ చేశాడు.
ప్రముఖులు కూడా..
మన నడక, పరుగు, మాటలు, నిల్చోవడం, బరువులు మోయడం... ఇలా కండరాల సాయంతో చేసే చాలా పనుల్లో బాడీ లాంగ్వేజ్‌ను ఇంప్రూవ్ చేసుకుంటే.. చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అలెగ్జాండర్ తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ‘అలెగ్జాండర్ టెక్నిక్’ పేరుతో దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియాల లాంటి దేశాల్లో ఈ టెక్నిక్‌ను నేర్పేందుకు కోర్సులు కూడా మొదలయ్యాయి. బెర్నార్డ్ షా లాంటి ప్రముఖులు కూడా ఈ టెక్నిక్‌ను ఫాలో అయ్యారు.ఈ అలెగ్జాండర్ టెక్నిక్‌ను నేర్పించడానికి కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. వాళ్లు టెక్నిక్ నేర్చుకోవాలనుకునే వాళ్ల పోశ్చర్స్‌ను పరిశీలించి, వాళ్ల బాడీ లాంగ్వేజ్‌లోని లోపాలను సరిచేస్తారు. ఈ టెక్నిక్‌ను ప్రాక్టీస్ చేయడం వల్ల వల్ల ఒత్తిడి తగ్గుతుందని, కంటిచూపు మెరుగుపడుతుందనీ, శ్వాస సమస్యలు తగ్గుతాయని, వెన్నునొప్పులూ తగ్గిపోతాయనీ.. ఇలా చాలా లాభాలున్నాయనీ వాళ్లంటున్నారు.