70 గంటలూ పని చేయాల్సిందే.. మరోమారు నొక్కి చెప్పిన ఇన్ఫీ నారాయణ మూర్తి..!
సంపన్న దేశాలతో పోటీ పడి భారత్ వృద్ధి సాధించాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాల్సిందేనని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి మరోమారు నొక్కి చెప్పారు.
సంపన్న దేశాలతో పోటీ పడి భారత్ వృద్ధి సాధించాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాల్సిందేనని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి మరోమారు నొక్కి చెప్పారు. కానీ, విద్యావంతులు కష్టపడి పని చేయడానికి ముందుకు రారని సీఎన్బీసీ-టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారత్‌లో రైతులు, కార్మికులు కష్టపడి పని చేస్తున్నారు. కష్టపడి పని చేయడం భారత్‌లో సర్వ సాధారణం. కానీ మనలో చాలా మంది చదువు కోవడం భారీ డిస్కౌంట్‌గా పరిగణిస్తున్నాం.
ఈ విద్యను అందుకోవడానికి సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. భారతీయులంతా కష్టపడి చదివే దేశంలో విద్యావంతులు కష్టపడేందుకు వెనుకాడుతున్నారు అని నారాయణ మూర్తి చెప్పారు. భారత్ వృద్ధిరేటు సాధించాలంటే వారం 70 గంటలు కష్ట పడాలన్న తన సూచనపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు హోరెత్తించారని, కానీ నా ప్రకటనతో ఏకీభవిస్తున్నట్లు చాలా మంది మంచి మనుష్యులు, ఎన్ఆర్ఐలు నాకు ఫోన్ చేసి చెప్పారు అని నారాయణమూర్తి అన్నారు.
ఈ అంశంలో నేను హేతుబద్ధీకరిస్తాను. ఒకవేళ ఎవరైనా నా కంటే మెరుగ్గా పని చేసే వారు ఉండొచ్చు. అది నా ఫీల్డ్ కావాల్సిన అవసరం లేదు. నేను వారిని గౌరవిస్తా. వారితో సంప్రదిస్తాం. నేను చెప్పిందాంట్లో తప్పు ఉందని మీరు భావిస్తారా..? కానీ నాకలా అనిపించడం లేదు. పాశ్చాత్య దేశాల్లో చాలా మంది నా మిత్రులు, చాలా మంది ఎన్నారైలు, భారత్‌లో మంచి మనుషులు నాకు ఫోన్ చేశారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా నా ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. వారంతా చాలా సంతోషంగా ఉన్నారు అని నారాయణ మూర్తి తెలిపారు.
రచయిత, పరోపకారి అయిన నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి సైతం మాట్లాడుతూ, తన కుటుంబం కోసం వారానికి 70 గంటలు పని చేయడం సర్వ సాధారణం అని చెప్పారు. తాను, తన భర్త నిరంతరం వారానికి 90 గంటలు పని చేసేవారం అని తెలిపారు. ఇన్ఫోసిస్‌లో రోజువారీగా 85-90 గంటలు పని చేయడం కఠినంగా పని చేశాం అని నారాయణమూర్తి తెలిపారు. నేను పని చేయకుండా ఇతరులకు సలహా ఎలా ఇవ్వగలను అని చెప్పారు.
నేను ఆరున్నర రోజులు పని చేయడానికి పని చేస్తున్నా. ఎలక్ట్రానిక్స్ ప్రాంతంలోనూ ఆరున్నర రోజులు పని చేయడానికి ప్రయత్నిస్తా. ప్రతి రోజూ నేను ఉదయం ఆరు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లే వాడిని, 6.20 గంటలకుకల్లా ఆఫీసుకు వెళ్లొచ్చు. రాత్రి 8.15 గంటలూ లేదా 8.30 గంటలకు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లే వాడిని అని గుర్తు చేశారు. గతేడాది అక్టోబర్‌లో భారత్‌లో యువతరం వారానికి ఏడు గంటలు చేయాలని ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైంది.