వాట్సప్‌ యూజర్లందరికీ పేమెంట్‌ సర్వీసెస్‌ చాన్స్‌

గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

Advertisement
Update:2024-12-31 18:31 IST

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ వాట్సప్‌ యూజర్లందరూ ఇకపై వాట్సప్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. వాట్సప్ పేమెంట్స్‌ యూజర్లపై ఉన్న పరిమితిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్‌ పేమెంట్స్‌ కమిషన్‌ ఎత్తివేసింది. దీంతో వాట్సప్‌ మెసేజింగ్‌ యాప్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ పేమెంట్‌ సర్వీసెస్‌ ను కూడా ఉపయోగించుకోవచ్చు. భారత్‌ లో 50 కోట్ల మంది వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సంస్థ వాట్సప్‌ పేమెంట్‌ అనే ఫీచర్‌ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే దాని ద్వారా నగదు చెల్లింపులు చేయడం, రిసీవ్‌ చేసుకోవడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. 2022లో నాలుగు కోట్ల మంది వినియోగదారులకు మాత్రమే ఈ పేమెంట్‌ విధానం అందుబాటులోకి రాగా అదే ఏడాది వినియోగదారుల సంఖ్యను 10 కోట్ల మందికి పెంచుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆ పరిమితిని ఎత్తివేసింది.

Tags:    
Advertisement

Similar News