Mutual Funds Returns | మ్యూచువల్ ఫండ్స్ మదుపు మేలు.. 2.30 రెట్ల రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఇవే..!
Mutual Funds Returns | ప్రతి ఒక్కరూ కుటుంబ భవిష్యత్ లక్ష్యాలు, అవసరాల కోసం తమ ఆదాయంలో కొంత భాగం పొదుపు చేస్తుంటారు.
Mutual Funds Returns | ప్రతి ఒక్కరూ కుటుంబ భవిష్యత్ లక్ష్యాలు, అవసరాల కోసం తమ ఆదాయంలో కొంత భాగం పొదుపు చేస్తుంటారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు, రికరింగ్ డిపాజిట్ పథకాల వంటి సంప్రదాయ మదుపు పథకాలు మొదలు.. ఒకింత రిస్క్‌తో కూడిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్య కాలిక కుటుంబ అవసరాలకు మ్యూచువల్ ఫండ్స్, రిస్క్ ఉన్నా లాభాలు సంపాదించి పెట్టే స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్, బంగారంలో మదుపు చేస్తుంటారు. కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితుల్లో మూడేండ్లుగా ఒకేసారి భారీ మొత్తం పెట్టుబడులు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ మదుపర్లకు రెట్టింపు రిటర్న్స్ అందించాయి. అటువంటి మ్యూచువల్ ఫండ్స్‌లో 40 ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్స్) ఉన్నాయి. మరో 209 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై 2.30 రెట్లు రిటర్న్స్ అందించి పెట్టాయి. అలా రెట్టింపు లాభాలు గడించి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్‌లో టాప్ ఫండ్స్ చూద్దామా..!
గత మూడేండ్లలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లో ఒకేసారి భారీగా మదుపు చేసిన పెట్టుబడిపై గత మూడేండ్లలో 2.70 రెట్లు లాభాలు వచ్చాయి. ఉదాహరణకు మీరు మూడేండ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే 39.17 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్)తోపాటు రూ.2.69 లక్షల రిటర్న్స్ అందుకుంటారు.
మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్‌లో పెట్టుబడులపై మూడేండ్లలో 2.48 రెట్లు లాభాలు వచ్చాయి. మీరు మూడేండ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.2.48 లక్షలు అందుకుంటారు.
క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్‌లో పెట్టుబడులపై మూడేండ్లలో 2.41 రెట్లు రిటర్న్స్ లభించాయి. మీరు మూడేండ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.2.40 లక్షల లాభాలు అందుకుంటారు.
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్.. స్మాల్ క్యాప్ క్యాటగిరీలో అతిపెద్ద స్కీమ్. ఇందులో పెట్టుబడులపై మూడేండ్లలో 2.40 రెట్లు లాభాలు గడించొచ్చు. ఉదాహరణకు మీరు మూడేండ్ల క్రితం రూ.లక్ష మదుపు చేస్తే ఇప్పుడు రూ.2.40 లక్షలు పొందుతారు.
హెచ్ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్‌లో మూడేండ్లలో మదుపుపై 2.31 రెట్లు లాభాలు గడించవచ్చు. ఉదాహరణకు మీరు మూఏండ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.2.31 లక్షలు పొందవచ్చు.
క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో పెట్టుబడులపై మూడేండ్లలో 2.30 రెట్లు రిటర్న్స్ లభిస్తాయి. ఒకవేళ, మీరు మూడేండ్ల క్రితం రూ.లక్ష మదుపు చేస్తే ఇప్పుడు దాని విలువ రూ.2.30 లక్షలకు చేరుతుంది.