మోటొరోలా నుంచి బడ్జెట్ ఫోన్! ఫీచర్లు సూపర్!

బడ్జెట్ సెగ్మెంట్‌లో మిగతా బ్రాండ్‌లకు గట్టి పోటీనిచ్చేలా తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఆఫర్ చేస్తోంది మోటొరోలా. తాజాగా లాంఛ్ చేసిన ‘మోటో జీ45 5జీ (Moto G45 5G) మొబైల్‌లో మంచి బ్యాటరీతోపాటు మెరుగైన ప్రాసెసర్, కెమెరా, గొరిలా స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.

Advertisement
Update: 2024-08-22 14:30 GMT

ప్రముఖ మొబైల్‌ బ్రాండ్ మోటొరోలా నుంచి ఎంట్రీ లెవల్ బడ్జె్ట్ ఫోన్ లాంఛ్ అయింది. మొబైల్ ధర, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..

బడ్జెట్ సెగ్మెంట్‌లో మిగతా బ్రాండ్‌లకు గట్టి పోటీనిచ్చేలా తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఆఫర్ చేస్తోంది మోటొరోలా. తాజాగా లాంఛ్ చేసిన ‘మోటో జీ45 5జీ (Moto G45 5G) మొబైల్‌లో మంచి బ్యాటరీతోపాటు మెరుగైన ప్రాసెసర్, కెమెరా, గొరిలా స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.

మోటో జీ45 5జీ మొబైల్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 ఎస్‌ జెన్3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ హలో యూఐపై రన్ అవుతుంది. ఓఎస్‌కు ఒక ఏడాది పాటు ఆండ్రాయిడ్‌ అప్‌గ్రేడ్‌, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ వస్తాయి.

మోటో జీ45 5జీలో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది. 240హెర్ట్జ్ టచ్‌ సాంప్లింగ్‌ రేటు ఉంటుంది. స్క్రీన్‌కు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. వెనకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు మరో 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ ఉంటుంది. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

మోటో జీ45 5జీలో 20వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఐపీ52 రేటింగ్‌, డాల్బీఅట్మాస్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లు, 3.5ఎంఎం ఆడియో జాక్, 5జీ, బ్లూటూత్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి.

మోటో జీ45 5జీ.. 4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.10,999, 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999 ఉంది. బ్రిలియంట్‌ బ్లూ, బ్రిలియంట్‌ గ్రీన్‌, వివా మెజెంతా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లాంఛింగ్ ఆఫర్‌ కింద రూ.1,000 డిస్కౌంట్‌ ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News