Mahindra XUV 3XO | టాటా నెక్సాన్‌, మారుతి బ్రెజాల‌తో మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సై.. ఇవీ కొత్త ఫీచ‌ర్లు..!

Mahindra XUV 3XO | ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) త‌న కంపాక్ట్ ఎస్‌యూవీ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్ లిఫ్ట్ (Mahindra XUV300 facelift)..

Advertisement
Update:2024-04-20 14:46 IST

Mahindra XUV 3XO | ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (Mahindra & Mahindra) త‌న కంపాక్ట్ ఎస్‌యూవీ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్ లిఫ్ట్ (Mahindra XUV300 facelift).. మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) ఆవిష్క‌రించేందుకు సిద్ధం అవుతున్న‌ది. ఈ నెల 29న దేశీయ మార్కెట్ల‌తోపాటు ప్ర‌పంచ మార్కెట్ల‌లోనూ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) ఆవిష్క‌రిస్తారు. టాటా నెక్సాన్ (Tata Nexon), మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza), మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx), హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue), కియా సోనెట్ (Kia Sonet), నిసాన్ మ్యాగ్నైట్ (Nissan Magnite), రెనాల్ట్ కైగ‌ర్ (Renault Kiger) వంటి మోడ‌ల్ కార్ల‌తో పోటీ ప‌డుతుందీ మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO). అత్యున్న‌త భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు (ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్‌), ప‌లు ప‌వ‌ర్‌ట్రైన్ ఆప్ష‌న్ల‌తో వ‌స్తున్న‌ది. ఈ కారు ధ‌ర రూ.8.50 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.16 ల‌క్ష‌ల (ఎక్స్ షోరూమ్‌) మ‌ధ్య ప‌లుకుతుందని భావిస్తున్నారు.

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కారు అడ్రెనోక్స్ క‌నెక్ట్ టెక్నాల‌జీ (Adrenox Connect technology)తో రూపుదిద్దుకున్న‌ది. స్మార్ట్ ఫోన్‌లో అడ్రెనోక్స్ క‌నెక్ట్ యాప్ వాడుకుంటూ వినియోగించ‌వ‌చ్చు. కారు లోప‌ల టెంప‌రేచ‌ర్ అడ్జ‌స్ట్ చేయొచ్చు. ఈ ఫీచ‌ర్ సెలెక్టివ్ వేరియంట్ల‌లోనే ల‌భిస్తాయి. ఇది వేస‌విలో మాత్ర‌మే వినియోగించుకోవ‌డానికి వీలుగా ఉంట‌ది.

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కారు ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు వెర్టిక‌ల్లీ పిటెడ్ న్యూ ఫ్రంట్ గ్రిల్లే ఉంటుంది. 16-అంగుళాల అల్లాయ్‌వీల్స్‌, ఇన్‌సైడ్ క్యాబిన్‌లో డాష్ బోర్డ్‌, న్యూ ట‌చ్‌స్క్రీన్ ఇన్‌పోటైన్‌మెంట్‌, న్యూ డిజిట‌ల్ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌,డ్యుయ‌ల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్ట‌మ్‌, న్యూ స్టీరింగ్ వీల్‌, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్‌, సెగ్మెంట్ ఫ‌స్ట్ ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. సెకండ్ లెవ‌ల్ అడాస్ వంటి సేఫ్టీ ఫీచ‌ర్లు ఉంటాయి.

మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 300 (Mahindra XUV300)లో వాడిన ఇంజిన్‌, ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్లు మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) లోనూ వాడ‌తారు. ఈ కారు ఇంజిన్ 1.2 లీట‌ర్ల ట‌ర్బో చార్జ్‌డ్ మ‌ల్టీ పాయింట్ ఫ్యుయ‌ల్ ఇంజెక్ష‌న్ (టీసీఎంపీఎఫ్ఐ) పెట్రోల్ (110 పీఎస్‌/200 ఎన్ఎం టార్క్‌), 1.2 లీట‌ర్ల ఎం-స్టాలియోన్ ట‌ర్బో చార్జ్‌డ్ ఇంట‌ర్ కూల్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్ష‌న్ (టీజీడీఐ) పెట్రోల్ (130 పీఎస్ /230 ఎన్ఎం), 1.5 లీట‌ర్ల డీజిల్ (117 పీఎస్‌/300 ఎన్ఎం) ఇంజిన్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. టీసీఎంపీఎఫ్ఐ, డీజిల్ ఇంజిన్ కార్లు 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్, 6-స్పీడ్ ఏఎంటీ ఆప్ష‌న్‌, టీజీడీఐ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

Tags:    
Advertisement

Similar News