పార్ట్ టైమ్ జాబ్ కోసం చూస్తున్నారా? ఇది మీ కోసమే!

ఈ రోజుల్లో చాలామంది సంపాదన సరిపోక సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారు. ఇలాంటివాళ్లకు పార్ట్ టైం జాబ్స్ ఆర్థికంగా మంచి సపోర్ట్‌నిస్తాయి. ఉద్యోగంతో పాటు అదనంగా కొంత సమయం పనిచేయాలనుకునేవారికి పార్ట్ టైం లేదా ఫ్రీ లాన్స్ జాబ్స్ బెస్ట్ ఆప్షన్స్.

Advertisement
Update:2024-08-14 08:00 IST

ఈ రోజుల్లో చాలామంది సంపాదన సరిపోక సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారు. ఇలాంటివాళ్లకు పార్ట్ టైం జాబ్స్ ఆర్థికంగా మంచి సపోర్ట్‌నిస్తాయి. ఉద్యోగంతో పాటు అదనంగా కొంత సమయం పనిచేయాలనుకునేవారికి పార్ట్ టైం లేదా ఫ్రీ లాన్స్ జాబ్స్ బెస్ట్ ఆప్షన్స్. అయితే వీటికై ట్రై చేసేముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం.

పార్ట్ టైమ్ జాబ్స్ అంటే డెలివరీ జాబ్స్, టైపింగ్ వర్క్స్ లాంటివే అనుకుంటారు చాలామంది. అయితే వీటిలో కూడా స్కిల్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే పార్ట్ టైం లేదా ఫ్రీలాన్స్ జాబ్స్ పొందడం ఈజీ అవుతుంది. అవేంటంటే.

కమ్యూనికేషన్ స్కిల్స్

మీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలారకాల పార్ట్ టైం ఆఫర్స్ పొందొచ్చు. చాలా కంపెనీలు కస్టమర్ సపోర్ట్, సేల్స్ కన్సల్టెంట్ వంటి జాబ్స్‌ను ఫ్రీలాన్స్ లేదా పార్ట్ టైం విధానాల్లో ఆఫర్ చేస్తుంటాయి. వీటిని పొందడం కోసం మంచి ఇంగ్లిష్ లేదా లోకల్ లాంగ్వేజెస్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దీంతోపాటు మార్కెటింగ్ చేయగల నైపుణ్యం ఉంటే ఇంకా అదనంగా సంపాదించొచ్చు.

గ్రాఫిక్ డిజైనింగ్

ఫోటో, వీడియో ఎడిటింగ్ వంటిటి ఆసక్తి ఉంటే డిజైనింగ్ రంగంలో ప్రవేశించొచ్చు. చాలా కంపెనీలు గ్రాఫిక్ డిజైనింగ్ పనులను పార్ట్ టైం లేదా ఫ్రీ లాన్స్ రూపంలోనే ఆఫర్ చేస్తుంటాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, ఇలస్ట్రేటర్ వంటి సాఫ్ట్‌వేర్లు నేర్చుకుని గ్రాఫిక్ డిజైనర్‌‌గా సైడ్ కెరీర్ మొదలుపెట్టొచ్చు.

డెవలపర్/ టెస్టర్

మీరు సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్నా లేదా కోడింగ్‌పై అవగాహన ఉన్నా.. మీకు పార్ట్ టైం అవకాశాలు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా బోలెడు కంపెనీలు ప్రాజెక్ట్ బేస్డ్ డెవలపర్స్ కోసం చూస్తుంటాయి. ‘ఫ్రీలాన్సర్ డాట్‌కామ్’, ‘ఫివర్’ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో రిజిస్టర్ అయ్యి ఈ జాబ్స్‌ను వెతకొచ్చు. అలాగే చాలా కంపెనీలు తమ ప్రోగ్రామ్స్‌ను టెస్ట్ చేసే వారికోసం వెతుకుతుంటాయి. కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్‌వేర్ టెస్టర్ కూడా ట్రై చేయొచ్చు.

టీచింగ్

పార్ట్ టైంగా చేయదగ్గ మరో మంచి జాబ్ టీచింగ్. మీకున్న స్కిల్స్ లేదా సబ్జెక్ట్‌ను ఆన్‌లైన్ వేదికగా పంచుకోగలిగితే అదే మంచి ఇన్‌కమ్ సోర్స్ అవుతుంది. పలు ఆన్‌లైన్ టీచింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో రిజిస్టర్ అవ్వొచ్చు. లేదా మీరే ఒక కోర్సు డిజైన్ చేసి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టొచ్చు.

Tags:    
Advertisement

Similar News