iPhone 15 Pro Max Vs Samsung Galaxy S23 Ultra | ఐఫోన్‌15 ప్రో మ్యాక్స్.. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రాల్లో ఏది బెస్ట్‌..

ఈ నెల 12న‌ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన ఐ-ఫోన్15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఈ నెల 22 నుంచి భార‌త్ మార్కెట్‌లో ల‌భిస్తుంది.

Advertisement
Update:2023-09-20 15:29 IST

iPhone 15 Pro Max Vs Samsung Galaxy S23 Ultra | గ్లోబ‌ల్ టెక్ జెయింట్ ఆపిల్ త‌న ఐ-ఫోన్‌15 సిరీస్ ఫోన్ల‌లో హై ఎండ్ వేరియంట్ ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) కూడా గ‌త వారం మార్కెట్లో ఆవిష్క‌రించింది. కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో `వండ‌ర్‌ల‌స్ట్‌` అనే పేరుతో నిర్వ‌హించిన ఈవెంట్‌లో మార్కెట్లోకి తెచ్చింది ఆపిల్‌. ఈ ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్ ఆపిల్ సిరామిక్స్ షీల్డ్ మెటీరియ‌ల్‌తోపాటు 6.7-అంగుళాల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే (Super Retina XDR OLED) క‌లిగి ఉంటుంది.

ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) మోడ‌ల్ ఫోన్ ధ‌రే ప‌లుకుతున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) గ‌త ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది. ఈ ఫోన్ 6.8-అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్‌డీ+ డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే (Edge QHD+ Dynamic AMOLED 2X) క‌లిగి ఉంటుంది. రెండు స్మార్ట్ ఫోన్లు టాప్ హై ఎండ్ వేరియంట్లలోనూ ఒక టిగాబైట్ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. ఫిబ్ర‌వ‌రిలో శాంసంగ్ ఆవిష్క‌రించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్‌తో పోలిస్తే.. గ‌త వారం ఆపిల్ మార్కెట్లోకి తెచ్చిన ఐ-ఫోన్‌15 ప్రో మ్యాక్స్ వేరియంట్‌ (iPhone 15 Pro Max) ఫోన్ దాదాపు ఒకే ధ‌ర‌, అత్య‌ధిక స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటాయి.

ఐ-ఫోన్15 ప్రో మ్యాక్స్ వ‌ర్సెస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ధ‌ర‌లిలా..

ఈ నెల 12న‌ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన ఐ-ఫోన్15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఈ నెల 22 నుంచి భార‌త్ మార్కెట్‌లో ల‌భిస్తుంది. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నాచుర‌ల్ టైటానియం, వైట్ టైటానియం వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ ధ‌ర రూ.1,59,900 ప‌లికితే.. 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,79,900, ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ రూ.1,99,900 ప‌లుకుతుంది.

మ‌రోవైపు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్ 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ రూ.1,24,999 (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.1,34,999 (ఎక్స్ షోరూమ్‌)ల‌కు ల‌భిస్తుంది. 12 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.1,54,999 (ఎక్స్ షోరూమ్‌) ప‌లుకుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫాంట‌మ్ బ్లాక్‌, క్రీమ్‌, గ్రీన్‌, లావెండ‌ర్ రెడ్‌, గ్రాఫైట్‌, లైమ్‌, స్కై బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

ఇవీ స్పెషిఫికేష‌న్స్ తేడాలు

ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్‌ 6.7-అంగుళాల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే (6.7-inch Super Retina XDR OLED display) క‌లిగి ఉంటుంది. 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వ‌స్తున్న‌ది. ఆపిల్ న్యూ 3ఎన్ఎం చిప్ సెట్ (Apple's new 3nm chipset) ఏ17 ప్రో ఎస్వోసీ (A17 Pro SoC) క‌లిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్ 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్‌డీ+ (3,088 x 1,440 పిక్సెల్స్‌) డైన‌మిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే (6.8-inch Edge QHD+ (3,088 x 1,440 pixels) Dynamic AMOLED 2X) క‌లిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌తో క‌లిసి వ‌స్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 విత్ వ‌న్ యూఐ 5.1 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. ఐఫోన్‌-15 ప్రో మ్యాక్స్ మాదిరిగానే శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా ఫోన్ గ్రేడ్5 టైటానియం అండ్ అల్యూమినియం స‌బ్‌-స్ట్ర‌క్చ‌ర్‌తో మ‌న్నిక క‌లిగి ఉంటుంది. ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్‌లో మ్యూట్ స్విచ్ ఆప్ష‌న్ ఉంటే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23లో యాక్ష‌న్ బ‌ట‌న్ ఉంటుంది.

ఇలా కెమెరా సెట‌ప్‌

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) క్వాడ్ రేర్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న‌ది. 200-మెగా పిక్సెల్ వైడ్ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్‌, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది.

ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ క్వాడ్ కెమెరా సెట‌ప్‌తో అందుబాటులోకి వ‌స్తుంది. 48-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగా పిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో కెమెరా, 12-మెగా పిక్సెల్ పెరిస్కోప్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్ ట్రూ డెప్త్ కెమెరా క‌లిగి ఉంటుంది.

ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ తొలిసారి యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీతో వ‌స్తుండ‌గా, బ్యాట‌రీ లైఫ్ 24 గంట‌ల‌కు పైగా ఉంటుంద‌ని ఆపిల్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా 45 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తున్న‌ది. డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్‌పై రెండు ఫోన్ల‌కూ ఐపీ68 రేటింగ్ ల‌భిస్తోంది.


Tags:    
Advertisement

Similar News