బెంగళూరులో లగ్జరీ ఫ్లాట్ కొన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
కింగ్ ఫిషర్ టవర్స్‌లో కొనుగోలు చేశారని మీడియా కథనాలు
Advertisement
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి బెంగళూరులో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశాడని నేషనల్ మీడియాలో కథలు ప్రచురితమయ్యాయి. బెంగళూరులోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పే యూబీ సిటీలోని కింగ్ ఫిషర్ టవర్స్‌లోని 16వ అంతస్తులో ఆయన ఫ్లాట్ కొన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. దీని ధర రూ.50 కోట్లు అని వెల్లండించారు. 8,400 స్క్వేర్ ఫీట్స్ ఉన్న ఈ ఫ్లాట్‌ను నారాయణమూర్తి ముంబయికి చెందిన ఒక వ్యాపారవేత్త నుంచి కొనుగోలు చేశారని, ఇటీవల కాలంలో జరిగిన ప్రాపర్టీ లావాదేవీల్లో ఇదే ఖరీదైనదని ఆ కథనం వెలువరించింది. నాలుగేళ్ల క్రితం నారాయణమూర్తి ఇదే టవర్స్‌లో తన భార్య సుధామూర్తి పేరుతో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు.
Advertisement