స్టాక్‌ మార్కెట్లు ఢమాల్‌!

720 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

Advertisement
Update:2025-01-03 16:22 IST

కొత్త సంవత్సరం మొదటి రెండు రోజులు ఆశాజనకంగా కనిపించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు మూడో రోజు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం 80,072.99 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటికే 900 పాయింట్లను కోల్పోయింది. చివరికి 720.60 పాయింట్లు కోల్పోయి 79,223.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 207.25 పాయింట్ల నష్టంతో 23,981.40 పాయింట్ల వద్ద ముగిసింది. కొత్త సంవత్సరంలో రూపాయి పతనం వేగంగా కొనసాగుతోంది. శుక్రవారం డాలర్‌ తో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు కోల్పోయి రూ.85.78 వద్ద ముగిసింది. టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, రిలయన్స్‌, టైటాన్‌ షేర్లు లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ , అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, జొమాటో, టెక్‌ మహీంద్ర షేర్లు నష్టపోయాయి.

Tags:    
Advertisement

Similar News