క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? ఇలా సెలక్ట్ చేసుకోండి!
ఉద్యోగాలు చేసేవాళ్లు క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటితో రకరకాల వెసులుబాట్లతో బాటు కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పక చెక్ చేసుకోవాలి.
ఉద్యోగాలు చేసేవాళ్లు క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటితో రకరకాల వెసులుబాట్లతో బాటు కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పక చెక్ చేసుకోవాలి. అవేంటంటే..
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చాలామంది క్రెడిట్ కార్డు తీసుకుంటారు. అయితే క్రెడిట్ కార్డుతో అదొక్కటే బెనిఫిట్ కాదు, సరైన కార్డులను సరైన సమయాల్లో వాడుకోవడం తెలిస్తే రకరకాల ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు.
ముందుగా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు లేని కార్డుని ఎంచుకోవాలి. ఇప్పుడు చాలా సంస్థలు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. వాటిని ఎంచుకుంటే బెటర్.
క్రెడిట్ కార్డు ఎంచుకునేటప్పుడు దాని వడ్డీ రేట్లను కూడా ముందే తెలుసుకుంటే మంచిది. అందుబాటులో ఉన్న అన్ని క్రెడిట్ కార్డులను పోల్చి చూసుకుని తక్కువ వడ్డీ రేటు ఉన్న కార్డులను ఎంచుకోవడం ఉత్తమం.
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవాళ్లు ఒకేరకమైన కార్డులకు బదులు రకరకాల కేటగిరీ కార్డులను ఎంచుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఉదాహరణకు పెట్రోల్‌పై క్యాష్ బ్యాక్స్ ఇచ్చే కార్డులను పెట్రోల్ కోసం వాడొచ్చు. ట్రావెల్ ఆఫర్స్ అందిస్తున్న కార్డులను ట్రావెల్ బుకింగ్స్‌కు వాడొచ్చు. తక్కువ వడ్డీ రేట్లు ఉన్న కార్డులను ఈఎంఐ వంటి వాటికి వాడొచ్చు. అలాగే షాపింగ్ కార్డులు, హోటల్స్‌పై డిస్కౌంట్స్.. ఇలా రకరకాల బెనిఫిట్స్ కోసం రకరకాల కార్డులు ఉపయోగించొచ్చు. అయితే ఎక్కువ కార్డులు వాడగలిగిన వాళ్లే వాటిని తీసుకోవాలి. ఊరికే తీసుకుని వాడకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది.
క్రెడిట్ కార్డు తీసుకునేముందు అసలు మీరు వేటికి ఎక్కువగా ఖర్చు పెడతారో తెలుసుకుని దానికి తగ్గ కార్డుని ఎంచుకుంటే బాగుంటుంది. ఉదాహరణకు నెలలో మీకు నిత్యావసరాల ఖర్చు తప్ప మరేదీ లేదు అనుకున్నప్పుడు ఇ–కామర్స్ సైట్స్‌పై ఆఫర్లు ఉండే కార్డు ఎంచుకుంటే డబ్బు ఆదా చేసినట్టు అవుతుంది. గ్రాసరీస్ కొనుగోలు చేసినప్పుడల్లా డిస్కౌంట్ పొందే వీలుంటుంది.
ఇకపోతే క్రెడిట్ కార్డులు ఎంచుకునేముంది టర్మ్ అండ్ కండిషన్స్ పూర్తిగా తెలుసుకోవాలి. ట్రాన్సాక్షన్ ఛార్జీలు, రివార్డు పాయింట్ల వివరాలు, అదనపు రుసుముల వంటివి తెలుసుకున్నాకే కార్డుని సెలక్ట్ చేసుకోవాలి.