క్యాంపస్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే..

మరో రెండు నెలల్లో ఏడాది ముగుస్తుంది. ఈ సమయంలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ ఎక్కువగా జరుగుతాయి.

Advertisement
Update:2023-10-31 18:41 IST

మరో రెండు నెలల్లో ఏడాది ముగుస్తుంది. ఈ సమయంలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌ ఎక్కువగా జరుగుతాయి. పేరొందిన కార్పొరేట్‌ సంస్థలు కాలేజీల్లో నిర్వహించే ఈ క్యాంపస్ డ్రైవ్స్‌లో ఎలాగైనా సెలక్ట్ అవ్వాలని విద్యార్థులు ఆశ పడుతుంటారు. మరి వీటికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాంపస్ డ్రైవ్స్‌లో పలు రౌండ్లలో విద్యార్థుల స్కిల్స్‌ను పరీక్షిస్తారు. అన్ని రౌండ్లు క్లియర్ చేసిన వాళ్లు కోర్సు పూర్తయిన వెంటనే మంచి శాలరీతో జాబ్‌లో జాయిన్ అవ్వొచ్చు. ఈ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అభ్యర్థులు కొన్ని విషయాలు గమనించుకోవాలి.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో సాధారణంగా టెక్నికల్, పర్సనల్, హెచ్‌ఆర్‌ రౌండ్లు ఉంటాయి. టెక్నికల్‌ రౌండ్‌లో చదువుతున్న కోర్సుకి సంబంధించిన నాలెడ్జ్‌ను పరీక్షిస్తారు. అభ్యర్థులు వాళ్ల సబ్జెక్ట్స్‌కు సంబధించిన పూర్తి నాలెడ్జ్‌తో ఉండాలి. ఆయా రంగాల్లో జరుగుతున్న మార్పులు, కొత్త టెక్నాలజీలపైన అవగాహన కలిగి ఉండాలి. మీకున్న నాలెడ్జ్‌ను భయపడకుండా ప్రజెంట్ చేయగలగాలి. ఈ రౌండ్ నెగ్గితే రెండో రౌండ్‌కు సెలక్ట్ అవుతారు.

సెకండ్‌ రౌండ్‌లో సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జిని టెస్ట్ చేస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్, టాస్క్ సాల్వింగ్ వంటి పరిక్షలు పెడతారు. రియల్ టైంలో మీ స్కిల్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటారు. ఈ రౌండ్‌లో తడబడకుండా ప్రవర్తించగలిగితే చివరి రౌండ్‌కు వెళ్లొచ్చు.

ఇక చివరి రౌండ్ అయిన హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో పర్సనల్ స్కిల్స్, బిహేవియర్, సాఫ్ట్ స్కిల్స్ వంటివి పరిశీలిస్తారు. ఈ రౌండ్‌లో అభ్యర్థులు ఎలాంటి భయం, తడబాటు లేకుండా ప్రవర్తించాలి. జాబ్ వస్తుందో, రాదో.. అన్న భయాన్ని వదిలి కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కమ్యూనికేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? మీ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో ఇంటర్వ్యూయర్‌‌కు స్పష్టంగా తెలియజేయాలి. రిజల్ట్ గురించి బెంగ వద్దు.

ఇక చివరిగా మీరు నిజంగా ఆ జాబ్‌కు సూట్ అవుతారు అనుకుంటే సెలక్టర్లు మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఒకవేళ సెలక్ట్ అవ్వకపోతే మీకోసం మరో జాబ్ ఎదురుచూస్తుందని గుర్తుంచుకోవాలి.

ఇకపోతే ఈ మూడు రౌండ్లకు ప్రిపేర్ అయ్యేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముందుగా ‘ఎలాగైనా జాబ్ సంపాందించాలి’ అనే తొందరను వీడి సబ్జెక్ట్ నాలెడ్జి, రియల్ టైం స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై శ్రద్ధ పెట్టాలి. సెలక్ట్ అయిన తర్వాత చేయాల్సిన జాబ్ గురించి ముందే ఒక అంచనాకు రావాలి. ఆ రోల్‌కు కావాల్సిన స్కిల్స్‌ను అంచనా వేసుకుని వాటిని ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు కాంటంపరరీ స్కిల్స్, మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, కరెంట్ అఫైర్స్, లీడర్‌‌షిప్ క్వాలిటీస్ వంటివి మెరుగుపరుచుకోవాలి. అలాగే రెజ్యూమెని క్రియేటివ్‌గా, వివరంగా పొందుపరచుకోవాలి.

Tags:    
Advertisement

Similar News