Gold Rates | గత 12 రోజుల్లో జీవిత కాల గరిష్టానికి బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా..?!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరుకున్నది. 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1090 వృద్ధి చెంది రూ.73,310 వద్ద నిలిచింది.
Gold Rates | బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో మక్కువ.. భారతీయులు.. ప్రత్యేకించి మహిళలు బంగారం ఆభరణాలంటే ప్రాణం పెడతారు. ప్రతి పండుగకు, పెండ్లిండ్లకు, శుభకార్యాలకు వీలైతే పిసరంత బంగారం కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి పెండ్లిలోనూ నవ వధూవరులకు, ఆడబడుచులకు బంగారం పెడతారు. కానీ అంతర్జాతీయంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ తదితర పరిణామాలకు తోడు ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు 2022 మే నుంచి కీలక వడ్డీరేట్లు పెంచుతూ వచ్చిన యూఎస్ ఫెడ్ రిజర్వ్ వచ్చే జూన్ నుంచి ద్రవ్య లభ్యత కోసం వడ్డీరేట్లు తగ్గిస్తామని సంకేతాలిచ్చింది. దీంతో యూఎస్ డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ పతనం కావడం, ఆర్బీఐ సహా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు భారీగా నిల్వలు పెంచుకోవడంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారంపై మదుపునకు సిద్ధం కావడంతో డిమాండ్ పెరిగింది.
గత 12 రోజులుగా ప్రతి నిత్యం బంగారం ధర కొండెక్కుతున్నది. ఈ నెల ఒకటో తేదీన చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.70,402 పలికితే, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.64,550 వద్ద స్థిర పడింది. శుక్రవారం (ఏప్రిల్ 12) నాడు తులం (24 క్యారట్లు) ధర రూ.880 పెరిగి రూ.74,240లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది. ఈ నెల తొలి 12 రోజుల్లోనే దాదాపు రూ.4,000 వృద్ధి చెందింది.
జనవరి ఒకటో తేదీన 24 క్యారట్ల బంగారం ధర తులం రూ.64,470 పలికితే, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.64,470 వద్ద స్థిర పడింది. అంటే 100 రోజుల్లో 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రమారమీ రూ.10 వేలు పెరిగింది. సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు అందనంత ఎత్తుకు బంగారం పెరిగిపోతున్నది.
దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం ధరల వివరాలు తెలుసుకుందామా..!
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్స్ తులం ధర రూ.800 వృద్ధితో రూ. 68,050, 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ.880 వృద్ధి చెంది రూ. రూ.74,240 పలుకుతుంది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఆభరణాలను తయారు చేయడానికి వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1000 వృద్ధి చెంది రూ.67,200లకు చేరుకున్నది. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1090 పుంజుకుని రూ.73,310 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.250 తగ్గి రూ.84,250 వద్ద నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరుకున్నది. 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1090 వృద్ధి చెంది రూ.73,310 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.1,500 పెరిగి రూ.90 వేల వద్ద స్థిరపడింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1000 వృద్ధి చెంది రూ.1000 పెరిగి రూ.67,350 వద్ద స్థిరపడింది. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1090 పుంజుకుని రూ.73,460 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.1,500 పెరిగి రూ.86,500 వద్ద స్థిరపడింది.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1000 పెరిగి రూ.67,200 వద్ద నిలిచింది. 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1090 వృద్ధి చెంది రూ.1090 వృద్ధి చెంది రూ.73,310 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర రూ.1,500 పెరిగి రూ.86,500 వద్ద స్థిరపడింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.1000 వృద్ధితో రూ.67,200 వద్ద నిలిచింది. 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.73,310 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.1,500 పెరిగి రూ.86,500 వద్ద స్థిరపడింది.