Equity Mutual Funds | ఈ ఈక్విటీ లింక్డ్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల‌పై డ‌బుల్ రిట‌ర్న్స్‌.. ఇవీ డిటైల్స్‌..!

Equity Mutual Funds | గ‌త మూడేండ్లు సుమారు 26 మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల‌పై రెట్టింపు లాభాలు వ‌చ్చాయ‌ని ఏసీఈఎంఎఫ్ పేర్కొంది.

Advertisement
Update:2024-03-28 08:30 IST

Equity mutual Funds | ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కుటుంబం, పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం త‌మ ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. సంప్ర‌దాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌, రియ‌ల్ ఎస్టేట్‌, బంగారంపై పెట్టుబ‌డులు పెడుతుంటారు. రిస్క్ చేయ‌గ‌లిగితే ప్ర‌ణాళికాబ‌ద్ధంగా స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డుల‌పై స్వ‌ల్ప‌కాలంలోనే మెరుగైన రిట‌ర్న్స్ అందుకోవ‌చ్చు. ఈక్విటీ ఆధారిత‌, కీల‌క రంగాల బేస్డ్ మ్యూచువ‌ల్ పండ్స్‌లో పెట్టుబడుల‌పైనా మెరుగైన రాబ‌డి ల‌భిస్తుంది. స్వ‌ల్ప‌కాలిక‌, మధ్య‌కాలిక‌, దీర్ఘ‌కాలిక ఈక్విటీ లింక్డ్‌ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు. క‌నీసం ఐదారేండ్లలో 15 ఏండ్ల సుదీర్ఘ కాలం సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌) అమ‌లు చేసే ఇన్వెస్ట‌ర్ల‌కు నిక‌ర‌మైన లాభాలు వ‌స్తాయి. గ‌త మూడేండ్లు సుమారు 26 మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డుల‌పై రెట్టింపు లాభాలు వ‌చ్చాయ‌ని ఏసీఈఎంఎఫ్ పేర్కొంది. అందులో టాప్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇలా..

* క్వాట్ స్మాల్ క్యాప్ ఫండ్ (Quant Small Cap Fund) మూడేండ్ల‌లో 196 శాతం రిట‌ర్న్స్ అందించింది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ ఫండ్‌లో రూ.ల‌క్ష మ‌దుపు చేస్తే మూడేండ్ల‌లో రూ.2.95 ల‌క్ష‌లు అవుతుంది.

* క్వాండ్ మిడ్ క్యాప్ ఫండ్ (Quant Mid Cap Fund)లో పెట్టుబ‌డుల‌పై మూడేండ్ల‌లో 158 శాతం రాబడి ల‌భించింది. ఉదాహ‌ర‌ణ‌కు రూ.ల‌క్ష మ‌దుపు చేస్తే మూడేండ్ల‌లో రిట‌ర్న్స్‌తో క‌లిపి రూ.2.58 ల‌క్ష‌ల న‌గ‌దు అందిస్తుంది.

* క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (Quant Flexi Cap Fund)లో పెట్టుబ‌డుల‌పై 144 శాతం లాభం ల‌భిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఈ ప‌థ‌కంలో రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెడితే మూడేండ్ల త‌ర్వాత రూ.ల‌క్ష‌తోపాటు రూ.1.43 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ ల‌భిస్తాయి.

*నిప్ప‌న్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ (Nippon India Small Cap Fund) అనే ఫండ్ స్మాల్ క్యాప్ క్యాట‌గిరీలో సుదీర్ఘ‌కాలం సాగే ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌. దీనిమీద పెట్టే పెట్టుబ‌డుల‌పై 143 శాతం రిట‌ర్న్స్ అందుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.ల‌క్ష మ‌దుపు చేస్తే మూడేండ్ల త‌ర్వాత అది రూ.2.43 ల‌క్ష‌ల‌కు పెరుగుతుంది.

* హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ (HSBC Small Cap Fund) లో పెట్టుబ‌డుల‌పై 138 శాతం రిట‌ర్న్స్ ల‌భిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెడితే మూడేండ్ల‌లో రూ.2.38 ల‌క్ష‌ల‌కు చేరుతుంది.

* క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవ‌ర్ ఫండ్ (Quant ELSS Tax Saver Fund)లో పెట్టుబ‌డిపై 134 శాతం లాభం పొందొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెడితే మూడేండ్ల త‌ర్వాత మ‌దుప‌ర్ల‌కు 1.33 ల‌క్ష‌ల ఆదాయంతోపాటు రూ.2.33 ల‌క్ష‌ల రిట‌ర్న్స్ ల‌భిస్తాయి.

* మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ (​Motilal Oswal Midcap Fund)లో నిధులు మ‌దుపు చేస్తే మూడేండ్ల‌లో 132 శాతం బెనిఫిట్లు ల‌భిస్తాయి. మీరు ఉదాహ‌ర‌ణ‌కు ఈ ప‌థ‌కంలో రూ.ల‌క్ష మ‌దుపు చేస్తే మూడేండ్ల త‌ర్వాత అది రూ.2.32 ల‌క్ష‌లు అవుతుంది.

* హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ (HDFC Small Cap Fund) ఇన్వెస్ట‌ర్ల‌కు మూడేండ్ల‌లో సుమారు 127 శాతం రిట‌ర్న్స్ అందిస్తుంది. మీరు ఈ ప‌థ‌కంలో రూ.ల‌క్ష మ‌దుపు చేస్తే మూడేండ్ల త‌ర్వాత రూ.2.26 ల‌క్ష‌లు అవుతుంది.

*క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ (Quant Large & Mid Cap Fund) ప‌థ‌కంలో పెట్టుబ‌డుల‌పై 125 శాతం లాభాలు పొందొచ్చు. మీరు ఉదాహ‌ర‌ణ‌కు రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెడితే మూడేండ్ల త‌ర్వాత రూ.1.25 ల‌క్ష‌ల‌తో మొత్తం రూ.2.25 ల‌క్ష‌ల‌కు పెరుగుతుంది.

* ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల‌ర్ కాస్ ఫండ్ (Franklin India Smaller Cos Fund) ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెడితే మూడేండ్ల‌లో 122 శాతం రిట‌ర్న్స్ అందుకోవ‌చ్చు. మీరు ఈ ప‌థ‌కంలో రూ.ల‌క్ష పెట్టుబ‌డి పెట్టార‌ని అనుకుందాం. మూడేండ్ల త‌ర్వాత అది రూ.1.21 ల‌క్ష‌ల‌తో క‌లిసి రూ.2.21 ల‌క్ష‌ల‌కు చేరుతుంది.

Tags:    
Advertisement

Similar News