యూపీఐ పేమెంట్స్‌లో ఈ తప్పులు చేయొద్దు
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. పది రూపాయల నుంచి పది వేల దాకా ఎలాంటి చెల్లింపయినా యూపీఐ ద్వారానే జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని యూపీఐ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. పది రూపాయల నుంచి పది వేల దాకా ఎలాంటి చెల్లింపయినా యూపీఐ ద్వారానే జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని యూపీఐ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. అందుకే యూపీఐ పేమెంట్స్ విషయంలో కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించడం ఎంతైనా అవసరం.
యూపీఐ పేమెంట్స్ వాడకం సర్వ సాధారణం అవ్వడంతో దీన్ని అవకాశంగా మలచుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా యూపీఐ మోసాలకు పాల్పడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ విషయంలో మోసపోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
ముందుగా యూపీఐ సేవలు వాడడం కోసం సర్టిఫైడ్ యాప్స్‌నే వాడాలి. వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే పేమెంట్స్ యాప్స్‌కు తప్పనిసరిగా లాక్ పెట్టుకోవాలి. యూపీఐ పేమెంట్స్ చేసేందుకు పబ్లిక్ వైఫైల వంటివి వాడకపోవడమే ఉత్తమం
మీ యూపీఐ పిన్‌ను ఎవరితో షేర్ చేయకుండా చూసుకోవాలి. ఏటీఎం పిన్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లా యూపీఐ పిన్ కూడా చాలా సెక్యూర్డ్‌గా ఉంచుకోవాలి.
యూపీఐ ద్వారా డబ్బు పంపడానికి మాత్రమే పిన్‌ని నమోదు చేయాలి. డబ్బును స్వీకరించడానికి పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఎవరైనా డబ్బు పంపుతాం పిన్ చెప్పమని అడిగితే అనుమానించాలి.
యూపీఐ ద్వారా డబ్బు పంపేటప్పుడు అవతరి వారి ఐడీని ఒకటికి రెండు సార్లు ధ్రువీకరించుకోవాలి. పేరు కన్ఫర్మ్ చేసుకోకుండా డబ్బు పంపొద్దు.
యూపీఐ ఐడీ తప్పుగా ఎంటర్ చేసినప్పుడు లేదా పేరు సరిగా చూసుకోకుండా పేమెంట్ చేసినప్పుడు డబ్బు ఒకరికి బదులు మరొకరికి పోతుంది. ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు వెంటనే ఆయా యూపీఐ ప్లాట్‌ఫామ్‌ల కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. జరిగిన పొరపాటు గురించి చెప్పి కంప్లెయింట్ నమోదు చేయాలి. లేదా 1800 120 1740 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే డబ్బు కట్ అయిన బ్యాంకుకు వెళ్లి కూడా కంప్లెయింట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ డబ్బు రెండు మూడు రోజుల్లో తిరిగి రికవరీ అవుతుంది.