Anand Mahindra: మహీంద్రా.. బీఎస్ఏ నుంచి కొత్త మోటారు సైకిల్.. ఎక్స్ వేదికగా మహేంద్ర ట్వీట్..!
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బీఎస్ఏ గోల్డ్‌స్టార్ 650 (BSA Goldstar 650) మోటారు సైకిల్ లాంచింగ్ గురించి సంకేతాలిచ్చారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బీఎస్ఏ గోల్డ్‌స్టార్ 650 (BSA Goldstar 650) మోటారు సైకిల్ లాంచింగ్ గురించి సంకేతాలిచ్చారు. ఆగస్టు 15న బీఎస్ఏ మోటార్ సైకిల్ వస్తోందని ట్వీట్ చేశారు. దీంతో మోటారు సైకిళ్ల ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ మినీ ట్రక్కులు, కార్లు, ఆటోరిక్షాలు తయారుచేసిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తాజాగా మోటారు సైకిళ్ల తయారీపై దృష్టి కేంద్రీకరించింది.
ఇందుకోసం బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) బ్రాండ్‌తోపాటు భారత్‌లో యెజ్డీ, జావా మోటారు సైకిళ్లు తయారుచేస్తున్న క్లాసిక్ లెజెండ్స్‌తో జత కట్టింది మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా అండ్ మహీంద్రా, క్లాసిక్ లెజెండ్స్, బీఎస్ఏ 650 సంస్థల భాగస్వామ్యంతో వస్తున్న బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ ధర సుమారు రూ.3-3.20 లక్షలు (ఎక్స్ షోరూమ్ పలుకుతుందని భావిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ (Royal Enfield Interceptor)కు గట్టి పోటీ ఇవ్వనున్నది.
మహీంద్రా బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ 652 సీసీ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ డీఓహెచ్‌సీ, 4-వాల్వ్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ 6500 ఆర్పీఎం వద్ద 45 బీహెచ్పీ విద్యుత్, 4000 ఆర్పీఎం వద్ద 55 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. స్లిప్ ద్వారా అసిస్ట్ క్లచ్ సాయంతో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ మోటారు సైకిల్ రూపుదిద్దుకున్నది. ట్యూబులర్ డబుల్ క్రెడిల్ స్టీల్ ఫ్రేమ్, సస్పెన్సన్ సెటప్, ఫ్రంట్‌లో 41 ఎన్ఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్, ట్విన్ రేర్ షాక్ అబ్జార్బర్స్ విత్ 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్ ఉంటాయి.
పిరెల్లి ఫాంతామ్ స్పోర్టస్ కాంప్ టైర్లతో రెట్రో మోటారుసైకిల్ ఫ్రంట్‌లో 18 అంగుళాలు, రేర్‌లో 17 అంగుళాల వైర్ స్పోక్డ్ వీల్స్ ఉంటాయి. ఫ్రంట్‌లో 320 ఎంఎం డిస్క్, రేర్‌లో 255 ఎంఎం డిస్క్ బ్రేక్‌లతోపాటు డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ప్రామాణంగావాడతారు. రౌండ్ హలోజెన్ హెడ్ ల్యాంప్, సిగ్నేచర్ ట్విన్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, యూఎస్బీ పోర్ట్ చుట్టూ హ్యాండిల్ బార్ ఉంటుంది.