నీకు ఇష్టం కాదు
నాకూ కాదు
అయినా అమ్మ కడుపులో నుండే
మొదలు పెట్టేస్తాం.
లోకంలో పడగానే
చుట్టూ జనం
ఆకలి కేకలు వద్దన్నా
మనకు పోరాటం నేర్పేస్తాయి.
నా దారిన నేను పోదామనుకొన్నా
నా చుట్టూ అల్లుకున్న సాలెగూళ్లు
ప్రశాంతంగా ఉండనీవు.
కత్తి దూస్తేకాని మాటవినని
ఖరదూషణాదులు
రాబందులు ఎగిరినప్పుడల్లా రామచిలుకలు
భయపడుతూనే ఉంటాయి
యుద్ధం జరిగినప్పుడల్లా
సంధి వాక్యాలు
మొదలౌతునే ఉంటాయి
విధ్వంసం జరిగాక
పునర్ నిర్మాణం పేరుతో
దోపిడి జరుగుతూనే ఉంటుంది.
రాయబారం పేరుతో
బేరాలు, బీరాలు కొనసా..గి
కనుచూపు మేర కనబడని
శాంతి కపోతంకోసం
యుద్ధం అంటూ
స్వలాభాలు తీర్చుకునే
నేతలందరో
ఒక భయానికి
అనుమానాన్ని పెంచే
ఇంకా ఎందుకు యుద్ధం?
ఆపేద్దాం!
శాంతి కపోతాలు ఎగరేద్దాం.
గోవిందవర్జుల లక్ష్మీనారాయణ శాస్త్రి
Advertisement