కవులను గౌరవిద్దాం (కవిత)

Advertisement
Update:2023-12-09 09:56 IST

ఆరోగ్య శిక్షణ

ప్రాణ రక్షణ

సైనికుల స్ఫూర్తి

జయ కేతనం

కవిత

అమ్మ జోలపాట

అమ్మమ్మ కథలు

పొలాల్లోపాటలు

కవిత

బొడ్డెమ్మలగానం

జానపదపాటలు

కవిత

భారతమాత

సంకెళ్లు విడిపించిన

వందే మాతరం

కవిత

ప్రజల లో

దేశభక్తి,దైవభక్తి

పెంచేది కవిత

ధైర్య సాహసాల

సందేశం,

కవిత

సమస్యల,.

పరిష్కారం

కవిత

జనని జనకులు

ప్రత్యేక్ష దేవుళ్ళని

తెలిపేది

కవిత

బాంధవ్యాలు

వావివారుసలు

గుర్తుచేసేది కవిత

సమయపాలన

సంస్కృతి భోదించేది కవిత

ప్రకృతిని అడవి ప్రాణులను

కాపాడ మని

చెప్పేది కవిత

మానవులంతా

ఒకటేనని

ప్రజలలో ఐక్యత

పెంచేది కవిత

ఉద్యమాల ఊపిరి,కవిత శత్రువుల కు

దడుకు పుట్టించేది

కవిత

సర్వశక్తుల

పరిశోధకుల

ఆలోచనశక్తి కవిత

చదులతల్లి

బాసర

సరస్వతి

పలుకులు

వజ్రాయుధం

కవిత,

కవితను

ప్రేమిద్దాం,

కవులను గౌరవిద్దాం

-యెల్డి సుదర్శన్ పద్మశాలి,

(ముంబయి)

Tags:    
Advertisement

Similar News