ఫోటో (కవిత)

Advertisement
Update:2023-10-23 14:06 IST

దేవుని ఫోటో తోనే

జరిగింది గృహ ప్రవేశం.

తరతరాల సంస్కృతికి నిదర్శనం.

బ్రతుకంతా చల్లగ సాగుతుందన్న నమ్మకం.

బుద్ధుని ఛాయా చిత్రం.

ప్రతి ఉదయం ప్రశాంతతకు మూలం.

భూగోళం లో దేశపటం.

అనేకతలో ఏకత్వం.

అరటి గెలలు,

మామిడి తోరణాలు,

కొబ్బరాకుల మంటపంలో

కల్యాణ సంబరాలు.

అమ్మానాన్నల పెళ్ళి ఫోటోలో

బంధు బలగాలు

తెలుపు నలుపు వెలుగు చిత్రాలు

ఒకళ్ళ కొకళ్ళం ఉన్నామన్న

ప్రేమ బంధాలు.

ఇప్పుడు చిటికెలో చిత్రాలు,

పంపు కోళ్ళు,

దింపుకోళ్ళు.

సముద్రాలు దాటుతున్న

సమయానికన్నా ముందే

నెట్టింట్లో చలన చిత్రాలు,

పురోగమనానికి

విజ్ఞానంచేస్తోంది సాక్షి సంతకాలు.

సృష్టికి ప్రతి సృష్టి చేసే కాలానికి

కృత్రిమ మేధ మాయ కాదు

కళ్ళముందు కొచ్చి

వార్తలు వినిపించే క్రాంతికి

శీర్షమకుటమే కదా హిమాలయాలు 

రాజేశ్వరి దివాకర్ల

(వర్జినియా యు ఎస్ )

Tags:    
Advertisement

Similar News