చల్లగా ఆహ్లాదంగా
ఏమరుపాటుగా విస్తరించి
వీస్తున్న ఈ వెన్నెల కిందే
ఆకలితో మెలికలు తిరిగే
కొండచిలువలాంటి నీటితెర.
అలమటించే ఆకలి
దారిద్ర్యంతోనే కాపురం
పిలిస్తే పలికే
చావుతోనే సహజీవనం
అంతిమ శ్వాసదాకా
పెనుగులాడే జీవనవాంఛ.
చొచ్చుకుపోతున్న
వాడికత్తిలాంటి జీవనధార
జలసమాధి చేస్తున్న నీటితెరని
నిలువునా చీల్చి
మేల్కొంటూనే వుంది తిరిగి
ఆదుర్దాగా ఎదురుచూస్తున్న
పిండాకృతిలోంచి....!
-నిఖిలేశ్వర్
Advertisement