ఆలుచిప్పలోని ఆణిముత్యాలు
ఆకాశాన ధృవతారలు
ఇలలో మణిపూసలు
అడుగు దాటితే అపవిత్రమైన ఆడ బతుకులు!
జాతి రత్నాలు, వజ్రాలు
నింగిలోని మేరిసే కౌముదులు
చీకటి విరుచుకుపడి
బంగపడి మలినమైపోతున్న
ఇంటి వెలుగు దివ్వెలు!
పడమటి గాలి సోకిందని
పాశ్చాత్య వస్త్రం తోడిగిందని
కామం కళ్ళు విప్పింది అంటాడు ఒకడు
మోహం మానాన్ని కోరింది అంటాడు వేరొకడు!
అంగాల రక్షణకే కదా ఈ వస్త్రం
అది మనదైన
పరాయిదైన
అంగడిలో అమ్మకానికి రానప్పుడు
తన సౌఖ్యం తన ఇష్టమైనప్పుడు
నీ కంటికి ఎందుకు పట్టింది జాడ్యం !
బావిలో కప్పలే వల్లిస్తాయి నీతులు
నియామాలు కాదు నిగ్రహం నేర్చుకో
ఆలోచనల్లో సంస్కారం కనురెప్పగా మారిస్తే
నీవే ఒక రక్షక భటుడైతే
ఏ స్త్రీ అయినా కోరునా మరో రక్షణ!!
-జ్యోతి మువ్వల (బెంగళూరు)
Advertisement