సరస్వతీ వందనం ! ( పద్యకవిత)

Advertisement
Update:2023-01-26 14:27 IST

వినయము నొసగెడు విద్యను

జనులకు హితము సమకూర్చు

సత్జ్ఞానంబున్

నను దెలుసుకొనెడు శక్తిని

నినుసేవించెడు ధిషణను

నీవిడు వాణీ!

శ్వేతాంభోరుహ సింహపీఠిపయి, సుశ్వేతాంబరాచ్ఛాదవై,

చేతంబందున స్ఫూర్తినింపు చిలుకన్ చేదాల్చి , పీయూష

సంగీతాంభోధిని నోలలాడుచును, ఋగ్వేదాదులన్ నోట

సంకేతంబౌ లపితంబుగానిలుపుచున్, గీర్దేవి దీవించవే !

స్మేరలోచనా భయముద్ర

ధారివగుచు

స్మరణినొక చేత బూనుచు

చనువుమీర

జ్ఞాన ,ఇచ్చా ,క్రియా శక్తి

సత్ఫలమును

వరముగా ప్రసాదించుము

పలుకు బోటి !

పోతన నన్నయాదికవి పుంగవ సుందర పద్య ధోరణుల్

నూతన భావ గుంఫిత మనోఙ్ఞ కవిత్వ పటుత్వముల్-

సుసoజాతసుకల్పనాభరిత సాధురసామృత రంజనాంశముల్

నైతిక మూల్యముల్ నలువ నాయకి! నాకిడు నీకు మ్రొక్కెదన్!

కవనాధారమువై,

యమూల్యమగు సత్కావ్య ప్రభావాసివై,

ప్రవణాంతఃకరణంబునన్ వెలయు దివ్యానంద సంధాయివై,

అవలేపాంధము బాపు హేళివయి,సద్యః ఙ్ఞాన సంసేవ్యవై,

కవిలోకానికి మార్గదర్శివయి ,

లోకాలేలుమా భారతీ!

మాటలలోన పొందికయు, మైత్రిని నిల్పెడు యోచనోర్జయున్

మేటిగ నిల్చి పేరు గొను మేధయు,ధారణ ,పాండితీ ప్రభాధాటియు,ప్రజ్ఞ శేముషియు, తక్షణ విస్ఫురణా విభూతియున్

నోటిని వీడు జేసుకొని నుండుచు మెండుగనీయు భారతీ !

-కుంతి ( కె.కౌండిన్య తిలక్)

Tags:    
Advertisement

Similar News