సామాజిక మాధ్యమంలో వినూత్న ప్రయోగంగా ప్రతి నెలా మొదటి మూడవ గురువారాలలో వాట్సప్ గ్రూప్ గా సుమారు రెండేళ్లుగా వందలాదిమందిని అలరిస్తున్న
ఓసారి చూడండి.....అంతే !
(ప్రసన్నభారతి
వాట్సప్ ప్రసార సంచిక.)
రాబోయే ఉగాదికి కథల పోటీ నిర్వహిస్తోంది.ఆ వివరాలు ఇవి :
డా.భట్టిప్రోలు
దుర్గాలక్ష్మీప్రసన్న
స్మారక
శోభకృతు ఉగాది
వాట్సప్ కథల పోటీ
:::::::::::::::::::::::::::::::::::::::::::::
10,000/- రూపాయల
బహుమతులు
1000/- రూపాయల చొప్పున
పది కథలకు
సమాన బహుమతులు
:::::::::::::::::::::::::::::::::::::::::::::
వాట్సప్ లో మీ కథలు అందవలసిన చివరి తేదీ : 10.ఫిబ్రవరి 2023
ఃఃఃఃఃఃఃఃఃఃఃః
ఆ రోజు సాయంకాలం అయిదు తరువాత వచ్చేవి ఎట్టి పరిస్థితులలోనూ స్వీకరించబడవు
* కథ తెలుగువారి జీవితానికి సంబంధించి సాంఘికమై
ఆసక్తిగాచదివించేది కావాలి .
చారిత్రక ,క్రైమ్ కథలు పంపకూడదు.
*రచయిత (త్రు )లు తమ చేతిరాతలో రాసుకున్నప్పుడు A4 సైజ్ పేపర్ లో పేజీకి 25 లైన్లు చొప్పుననాలుగు పేజీలకు మించకుండా (సుమారు
1000పదాలు వచ్చేలా)
నిడివి మీరే చూసుకుని, వారి కథను కేవలం వాట్సప్ లోనే
Text ఫార్మాట్ లోనే 9849297958
నెంబర్ కు పంపించాలి.ఇవి వాట్సప్ లోనే ప్రధానంగా అంతా చదువుకునే కథలు కనుక ఈ నిడివిని ప్రతిపాదించడం జరిగింది.
* కథ
పిడిఎఫ్ గా కానీ,
స్కాన్ చేసిగానీ పంపకూడదు.
వాట్సప్ మెసేజ్ లానే
టెక్స్ట్ ఫార్మాట్ లోనే
(యూనికోడ్ డాక్యుమెంట్ గా నయినా )కథ పంపాలి.
అలా లేనివి పోటీకి స్వీకరించరు
*ప్రసన్నభారతి వాట్సాప్ ఉగాది కథల పోటీ కని పేర్కొంటూ కథ తమ
స్వంతరచనఅనీ
దేనికీ అనువాదం గానీ అనుసరణ గానీకాదని, మునుపు ఎక్కడా ప్రచురితంకాలేదనీ ,
పంచుకోలేదనీ ,
ఏపత్రికకుగానీ,
సామాజిక,
ప్రసారమాధ్యమాలకు
గానీపంపలేదని ,
పంపబోవడం లేదనీ స్పష్టమైన హామీపత్రం
కథ తో బాటుగా ఉండాలి
*కథ తోబాటు రచయిత (త్రు )లు తమ ఫోటో,
పూర్తి పిన్ కోడ్ తో సహా పోస్టల్ అడ్రస్,
గూగుల్ పే,
లేదా ఫోన్ పే
లేక పేటియమ్ నెంబర్
విధిగా పంపించాలి.
*బహుమతి పొందిన కథలు
"ఓ సారి
చూడండి ..అంతే !" ప్రసన్నభారతి వాట్సప్ ప్రసారసంచికలోను ,ఆపై ఆ కథలు తెలుగుగ్లోబల్.కామ్ లోనూ
చోటు చేసుకుంటాయి
*బహుమతి పొందిన పది కథలు కాక ఎంపికచేసిన మరో పదిహేనుకథలతో
కథా సంకలనం
ప్రచురించే అవకాశం వుంది
*రచయితలూ,
రచయిత్రులూ
తమ సృజనాత్మక
సరికొత్త కథా రచనలతో
శోభకృతు ఉగాది కథలపోటీని విజయవంతంచేయండి!!
ఫిబ్రవరి 10 వ తేదీలోగా కథలు వాట్సప్ చేయాల్సిన నెంబర్
98492 97958