జీవ(న)రహస్యం

Advertisement
Update:2023-04-29 20:37 IST
జీవ(న)రహస్యం
  • whatsapp icon

విజ్ఞానశాస్త్రం

కవిత్వం లాంటిదే

అయితే -

పదాలే కొంచెం భిన్నంగా ఉంటాయి.

అర్ధం కాకుండా ఉండి ,

కొంచెం భయపెడతాయి.

పదాలు చిన్నవే-

వచనాలు నిర్వచనాలు చిన్నవే

అర్ధాలే.. లోతుగా, ఎత్తుగా , పొడవుగా ,వివరంగా,

విశాలంగా ఉంటాయి.

కవిత్వం జీవన రహస్యం అయితే

జీవ- రహస్యమే కదా విజ్ఞానం ?

సృజనాత్మకతకు

రెండు శాఖలు కదా ఇవీ ?

కవితా చరణాల మీద

ఎంతకాలం పరిగెత్తినా అనుభూతులే తప్ప

అనుభవాలు ఏవి?

వాస్తవంలోకి, అనుభవంలోకి,

స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిస్తే కదా జీవనాడి దొరికేది?

జీవనాడి దొరికితే కదా ?

కవిత్వం ఊపిరి పోసుకునేది?

గుండెను పట్టుకోవటం

జ్ఞానం అయితే,

గుండె చప్పుడు వినగలగడమే- కవిత్వం!!

-డాక్టర్ దేవరాజు మహారాజు

Tags:    
Advertisement

Similar News