మొక్క మొలిచింది
ముదమారంగా
పుడమి తల్లి పులకించంగా
వొడి దుడుకుల
వాతావరణం లో
శక్తిని పెంచుకుంటూ
ఎదిగింది. పెరిగింది
మురిపాల పూలతో పులకించి
ప్రకృతితో సరసాలాడి
పిందె వేసింది
కాయ కాసి, మధురఫలమై
మానవ జీవితానికి
మనుగడనిచ్చి
ధన్యమైనది భూమాత
అది పుడమితో ప్రకృతి
స్త్రీత్వానికి వరంగా
జనించె చిట్టి తల్లి
చిలుకపలుకులచిన్నారి
బుడిబుడి నడకల బుట్టబొమ్మ
అమ్మ కనుసన్నలలో
పెరిగి పెరిగి కలికులకొలికి
పెళ్ళీడు కొచ్చింది.
సరాగాల సంసారంలో
మరోప్రాణికి జీవమిచ్చి
ఒడినింపుకుని నిలువునా పులకించి
జనని తరించాలని
మొక్కకి పుడమి తల్లి
జీవికి మమతల తల్లి
కాపాడు కావాలి నిరంతరంగా
ప్రకృతి, ధరణి , మాతృమూర్తి
మానవ జాతికి జీవనాడులు
కనిపెట్టు కోవాలి
కంటికి రెప్పలా
- అయ్యగారి సుబ్బులక్ష్మి (హైదరాబాదు )
Advertisement