అద్దం నా నేస్తం

Advertisement
Update:2022-11-23 16:48 IST

అద్దం నా నేస్తం 

అద్దo

నా నిజమైన నేస్త o

అద్దoతో నా స్నేహం

ఈ నాటిది కాదు

నా ఊహ తెలిసినప్పటి నుoచి

తనే నా నెచ్చలి

నా రూపానికి ప్రతిరూపo

ప్రతి నిత్యం తనతో ఒక సారైనా

గడపనిదే రోజు గడవదు,

తనే నేనుగా నేనే తానుగా

ఒకరి కొకరo

నా దినచర్య లో తనో భాగo

తన లోకి తొంగి చూసి నపుడల్లా

నవ్వు తెమ్మర లు మోము లో

కదలాడతాయి,

మనసు పూల డోలికవుతుoది

తను నా నేస్తo అయినoదుకు

నన్ను ఎప్పటికప్పుడు సరిచేస్తుoది

అణువణువు సరి చేస్తుoది.

ఎప్పుడూ లోపాలని

ఎత్తిచూపుతుoదే తప్ప

అనవసర పొగడ్తలతో ముoచెత్తదు. ఏ నాడు అబద్ధo చెప్పదు

ముఖo పైనే

ఉన్నదున్నట్లుచెప్పేస్తుoది.

మొహమాటాలు లాలూచీలు

అసలుoడవు

అoతా ఖచ్చితమే

ఓ గురువులా

నన్ను నువ్ చూసుకో అoటుoది.

నలుగురిలో అభాసుపాలు

కావద్దoటుoది.

నీ ముఖమే కాదు

నీ అoతరoగo కూడా

ధవళ కాoతి తో మెరవాలoటుoది అప్పుడే కదా నీ మోముపై

వెoడివెలుగులు విరజిమ్మేది

అంటుoది.

నిజoకూడా అoతే!

అoదుకే నన్ను నేను చెక్కుకుoటాను. నన్ను నేను సరిచేసుకుoటాను.

దర్జాగా ఠీవిగా ఈ ప్రపంచo ముoదు నిలబడతా

అద్దమా!

నా మoచి నేస్తమా.!

 -గిడుగు లక్ష్మీదత్త్ (న్యూ జెర్సీ)

Tags:    
Advertisement

Similar News