భావి తరాలకు భరోసా

Advertisement
Update:2022-11-29 13:24 IST

పారుతున్న పంట కాలువను అడుగు

పచ్చబడ్డ పొలాలను అడుగు

ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో చెబుతాయి

నేడు వెలుగులు విరజిమ్ముతున్న

నిరంతర కరెంటును అడుగు..

నాడు చీకట్లో మగ్గిన సమైక్య పాలనను గుర్తు చేస్తుంది

సమైక్య రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాగ్గావాలె అని

కొట్లాడిన తెలంగాణ బిడ్డను అడుగు..

స్వరాష్ట్రంలో 2 లక్షలకు పైగా కొలువులు సాధించిన గర్వం కనపడుతది

హైదరాబాద్ నగరం వైపు తరలివస్తున్న

పెట్టుబడుల ప్రవాహాన్ని అడుగు

విశ్వనగరంగా ఎదగడానికి కేసీఆర్ పాలనలో

చేపట్టిన అభివృద్ధిని చూపెడుతుంది

నాడు ఫ్లోరైడ్ రక్కసితో నడుం వంగిన నల్లగొండను అడుగు..

మిషన్ భగీరథతో తమకు జీవాధార అందించిన

కేసీఆర్ వైపు నీ చూపు తిప్పమని చెబుతుంది

60 యేండ్ల ఉమ్మడి రాష్ట్రంలో

మన అస్తిత్వం కోసమే ఆరాటపడ్డాం

ఎనిమిదేండ్లలో దేశానికే నేనున్నా అని ఆర్ధిక చేయూతను అందిస్తూ

సగర్వంగా మాది తెలంగాణ అని నిలబడ్డాం

నీళ్లు - నిధులు - నియామకాల లక్ష్యాన్ని

పరిపూర్ణం చేసుకున్నాం

దేశ గతిని మార్చే దిశగా.. తెలంగాణ అభివృద్ధి నమూనాతో

ముందుకు సాగుతున్నాం.

చావో రేవో అంటూ కేసీఆర్ ఆమరణ దీక్షతో

పోరాటాన్ని ముందుకు సాగించి

సబ్బండ వర్ణాలను ఏకం జేసిన

దీక్షాదివస్ స్ఫూర్తిగా.. తెలంగాణ అభివృద్ధి కోసం

పునరంకితం అవుదాం

పచ్చబడుతున్న తెలంగాణ మీద

కుట్రల పుట్టలను బద్దలు కొట్టి

ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుదాం

భావి తరాలకు ఒక గొప్ప భరోసానిద్దాం !!



- సత్య ప్రసాద్ పెద్దపెల్లి

Tags:    
Advertisement

Similar News