విదేశీ పర్యటనలో చంద్రబాబు ఫొటోలు ఎందుకు బయటకు రాలేదంటే..?

చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అన్నారు మంత్రి జోగి రమేష్. దోచుకున్న డబ్బుని విదేశాల్లో దాచుకోడానికి బాబు విదేశాలకు వెళ్లారా..? అని ప్రశ్నించారాయన.

Advertisement
Update:2024-06-01 15:47 IST

చంద్రబాబు విదేశాలకు వెళ్లారు, వచ్చారు. కానీ ఏ దేశం వెళ్లారనేది ఎవరికి క్లారిటీ లేదు. గతంలో బాబు హైదరాబాద్ వెళ్లినా, విజయవాడకు వచ్చినా.. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో టైమ్ తో సహా ట్వీట్లు పడేవి. ఎల్లో మీడియా లైవ్ అప్ డేట్స్ ఇస్తుండేది. కానీ విదేశీ పర్యటన విషయంలో మాత్రం ఏ దేశం, ఎక్కడికెళ్లారు, ఎందుకెళ్లారు, ఎవరెవర్ని కలిశారు అనేది గోప్యంగా ఉంచారు. ఆ మాటకొస్తే ఉద్దేశపూర్వకంగానే ఆ వివరాలన్నిటినీ రహస్యంగా ఉంచారని, ఎల్లో మీడయా కూడా ఎక్కడా ఆ వివరాలు బయటపెట్టడం లేదని తెలుస్తోంది.

కనీసం ఫొటోలు కూడా..

చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అన్నారు మంత్రి జోగి రమేష్. దోచుకున్న డబ్బుని విదేశాల్లో దాచుకోడానికి బాబు విదేశాలకు వెళ్లారా..? అని ప్రశ్నించారాయన. ఏ దేశం వెళ్లినా అక్కడ ఫొటోలు దిగి పబ్లిసిటీ చేసుకోవడం చంద్రబాబుకి అలవాటని, కానీ ఈసారి మాత్రం బాబు పర్యటనను రహస్యంగా ఉంచారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్న చంద్రబాబు విదేశీ పర్యటన గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, అయినా ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు జోగి రమేష్.

జగన్ లండన్ పర్యటన గురించి వైసీపీ ముందుగానే మీడియాకు సమాచారం ఇచ్చిందని, ఆయన లండన్ వెళ్లిన తర్వాత వీడియోలు కూడా బయటకు విడుదలయ్యాయని, ఆయన ఎక్కడెక్కడకు వెళ్లారనే విషయంపై కూడా సమాచారం ఉందని చెప్పారు మంత్రి జోగి రమేష్. జగన్ విషయంలో వైసీపీ అంత పారదర్శకంగా ఉందని, కానీ చంద్రబాబు మాత్రం తన పర్యటన వివరాలను ఎందుకు దాచి పెట్టాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక ఎగ్జిట్ పోల్స్ లో అయినా, అసలు పోల్స్ లో అయినా ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు జోగి రమేష్. 

Tags:    
Advertisement

Similar News