వైసీపీ నిరసనలు.. ఇదే షెడ్యూల్
గురువారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఏపీ పరిస్థితిని ప్రస్తావిస్తారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు.
సోమవారం అసెంబ్లీలో నిరసన
మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన
బుధవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన
గురువారం నుంచి పార్లమెంట్ లో ఏపీ దారుణాలు ఎండగట్టేలా కార్యాచరణ
ఈరోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో లోక్ సభ, రాజ్య సభ సభ్యులకు జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈనెల 24న ఢిల్లీలో తలపెట్టిన ఆందోళన కార్యక్రమంపై చర్చించారు. ఈ నిరసనకు సంబంధించి ఒక్కో ఎంపీ ఒక్కో బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ముందు రోజే ఏపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల్ని తరలించాలన్నారు. ఢిల్లీలో ఆరోజు ఏపీ గురించి చర్చ జరగాలన్నారు. ఏపీ ప్రభుత్వ దారుణాలను ఢిల్లీ వీధుల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు జగన్.
ఈనెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. సోమవారం గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగ సమయంలోనే తమ నిరసన తెలపాలని వైసీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్ అయ్యారు. ఆ రోజంతా అసెంబ్లీలో నిరసన గళం వినిపిస్తామంటున్నారు. తర్వాతిరోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరు కారు. ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వారంతా అక్కడికి వెళ్తారు. మంగళవారం రాత్రికి నేతలంతా ఢిల్లీకి చేరుకుంటారు. బుధవారం ఉదయాన్నే జంతర్ మంతర్ లేదా, మరో ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపడతారు. ఈ కార్యక్రమానికి ఇతర పార్టీల నేతల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. తమతో కలసి వచ్చే వారితో ఈ నిరసనను పెద్ద ఎత్తున చేపట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు.
గురువారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఏపీ పరిస్థితిని ప్రస్తావిస్తారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని దీనికి కారణం కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వమేనని వారు సభలో నినాదాలు చేస్తారు, ప్లకార్డులతో ఏపీ ప్రస్తుత పరిస్థితి వివరిస్తారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు.