రోజా ఒంటరి.. వైసీపీ నుంచి మద్దతేది..?

మంత్రి రోజాపై నోరుజారిన బండారు సత్యనారాయణను మీడియా కడిగిపారేసినంతగా వైసీపీ నేతలు దుమ్ముదులపకపోవడం విచిత్రంగా తోస్తోంది. రోజాకు మద్దతుగా ఎవరూ ముందుకు రాలేదు, మాట్లాడలేదు, ప్రతి విమర్శలు చేయలేదు. అందరూ మాకెందుకులే అనుకుని సైలెంట్ గా ఉన్నారు.

Advertisement
Update:2023-10-02 11:07 IST

జగన్ ని పల్లెత్తు మాట అంటే చాలు వరసబెట్టి ప్రెస్ మీట్లు పెట్టేస్తారు కొందరు వైసీపీ నేతలు.

పవన్ కల్యాణ్ మీటింగ్ అంటే.. టైమ్ గ్యాప్ లేకుండా కౌంటర్లు రెడీ చేసుకుంటారు కొందరు.

చంద్రబాబు అరెస్ట్, ములాఖత్ లు.. ఇలా ఏం జరిగినా స్పందించడానికి సై అంటుంటారు.

కానీ మహిళా మంత్రి రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన ఘాటు వ్యాఖ్యల విషయంలో ఎందుకో వైసీపీ వెనకపడిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ వ్యాఖ్యలకు అంతే ఘాటుగా బదులివ్వలేకపోయారు. మహిళా కమిషన్ కూడా, రామ్ గోపాల్ వర్మ స్పందించిన తర్వాత తీరిగ్గా డీజీపీకి ఓ లేఖ రాసింది. ఇంత జరిగినా ఇంకా సదరు మాజీ మంత్రి బండారు అరెస్ట్ కాలేదు. ఇదే ఇప్పుడు విశేషం.

రామ్ గోపాల్ వర్మ నేరుగా సాక్షి టీవీ ఇంటర్వ్యూలోనే ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఓ మహిళా మంత్రిపై ఆ స్థాయిలో విమర్శలు చేస్తే ఇంకా పోలీసులు ఏం చేస్తున్నట్టు అని అడిగారు. ఓ మహిళా మంత్రికే రక్షణ లేకపోతే దిశ, దశ అంటూ చెప్పేవన్నీ కథలేనా అని ప్రశ్నించారు. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు అదే నిజమనిపిస్తోంది. మంత్రి రోజాపై నోరుజారిన బండారు సత్యనారాయణను మీడియా కడిగిపారేసినంతగా వైసీపీ నేతలు దుమ్ముదులపకపోవడం విచిత్రంగా తోస్తోంది. రోజాకు మద్దతుగా ఎవరూ ముందుకు రాలేదు, మాట్లాడలేదు, ప్రతి విమర్శలు చేయలేదు. అందరూ మాకెందుకులే అనుకుని సైలెంట్ గా ఉన్నారు. మీడియా ముందు మాట్లాడలేదు సరే, కనీసం ట్వీట్లు కూడా పడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ మహిళా మంత్రిపై ఈ స్థాయిలో ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేసి ఉండరు. పోనీ రోజా వైసీపీలో యాక్టివ్ గా ఉండరా అంటే అదీ లేదు. జగన్ ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే మీడియా ముందుకొచ్చేస్తారు. జగన్ ఫ్యామిలీలో ఎవర్ని ఏమైనా అంటే చాలు, రోజా కౌంటర్లతో రెడీ అవుతారు. అలాంటి రోజాకు కష్టమొస్తే వైసీపీలో ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. 


Tags:    
Advertisement

Similar News