అనుకున్నంతా అయింది.. రజినీ ఎపిసోడ్ పార్ట్-2 మొదలైంది

రజినీకాంత్ కి వైసీపీ నేతలు సారీ చెప్పాలంటూ ట్వీట్ వేసిన చంద్రబాబు, ఆయన్ని మరింత దారుణంగా తిట్టిస్తున్నారు. ఈ తిట్ల ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ని మంత్రి రోజా మొదలు పెట్టగా, సెకండ్ పార్ట్ కి మరో మంత్రి జోగి రమేష్ బోణీ కొట్టారు.

Advertisement
Update:2023-05-01 19:37 IST

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రజినీకాంత్, చంద్రబాబుని పొగడటం, ఆ తర్వాత వైసీపీ నేతలు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ ఎపిసోడ్ అయిపోయిందనుకున్న టైమ్ లో చంద్రబాబు 'సారీ' ట్వీట్ వేసి వైసీపీ నేతల్ని మరోసారి రెచ్చగొట్టారు. దానికి రియాక్షన్ మొదలైంది. రజినీకాంత్ కి వైసీపీ నేతలు సారీ చెప్పాలంటూ ట్వీట్ వేసిన చంద్రబాబు, ఆయన్ని మరింత దారుణంగా తిట్టిస్తున్నారు. ఈ తిట్ల ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ని మంత్రి రోజా మొదలు పెట్టగా, సెకండ్ పార్ట్ కి మరో మంత్రి జోగి రమేష్ బోణీ కొట్టారు.

దొంగ.. తోడుదొంగ..

చంద్రబాబు వేదిక మీద ఉండగా ఆ కార్యక్రమానికి రజినీకాంత్ హాజరయ్యాడంటే, ఆయనకు మానవత్వం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఒక దొంగ అని, రజినీ మరో దొంగ అని మండిపడ్డారు. అసలు రజనీకాంత్ కి సిగ్గుగా లేదా..? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి భారతరత్న ఇప్పించుకోవాలని చంద్రబాబుకు గుర్తు లేదా? అని నిలదీశారు. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు చంద్రబాబును చెంపమీద కొట్టాలన్నారు. ఎన్టీఆర్ ని పొట్టనపెట్టుకున్న చంద్రబాబుని, ఎన్టీఆర్ అభిమానులు తరిమి తరిమి కొట్టాలన్నారు.

పనిలో పనిగా పవన్ కి కూడా..

ఇటీవలే చంద్రబాబుని ఇంటికెళ్లి మరీ కలిసొచ్చారు పవన్ కల్యాణ్. ఈ ఎపిసోడ్ పై కూడా మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పెళ్లి, టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు. తాము ఎవరితోనూ ఎవ్వరితో పొత్తులు పెట్టుకోమని, పవన్ కి సత్తా ఉంటే 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టాలని సవాల్ విసిరారు. పవన్ సన్నాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలన్నారు. జనసైనికులు అమాయకులని, వారంతా పవన్ ని సీఎం సీఎం అంటున్నారుని... కానీ పవన్ మాత్రం చంద్రబాబుని సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని, జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News