మరోసారి జగన్ ఓదార్పు యాత్ర.. ఎప్పుడంటే
ఈ యాత్ర డిసెంబర్ నుంచి ఉండొచ్చని సమాచారం. ఈ యాత్రతో కిందిస్థాయిలో ఉండే నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు రాజకీయ దాడులపై పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది.
వైసీపీ నేతల విసృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దాడుల్లో గాయపడిన వారితో పాటు వైసీపీ ఓటమి కారణంగా మృతిచెందిన వారిని పరామర్శించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ యాత్ర డిసెంబర్ నుంచి ఉండొచ్చని సమాచారం. ఈ యాత్రతో కిందిస్థాయిలో ఉండే నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు రాజకీయ దాడులపై పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వైసీపీ భావిస్తోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కూడా ధైర్యం నింపాలని యోచిస్తోంది.
ఘోర ఓటమి నుంచి వెంటనే తేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు తన ఆఫీసుకు వచ్చిన నేతలతో ఓటమిపై విశ్లేషణ చేసిన ఆయన తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు.
శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో.. ఆయా అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సెషన్స్‌లో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.