కడప ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో పర్యటించారు. అమీన్ పీర్ పెద్ద దర్గాలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాలల్లో పాల్గొన్నారు.

Advertisement
Update:2024-11-19 21:20 IST

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప అమీన్ పీర్ పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇవాళ కడపలో పర్యటించారు. అనంతరం ఆమె అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ట్వీట్టర్ వేదికగా ఆమె పోస్టు పెట్టారు. సామరస్యానికి, షరతులు లేని ప్రేమకు ప్రతీక ఈ ఉర్సు ఉత్సవాలు. ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైన స్థలం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశం. దైవం మీద నమ్మకం, మానవులందరూ ఒకటే అన్న భావానికి ప్రతీక పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు. హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీ నాయబ్-ఎ-రసూల్ నేర్పిన సూఫీ తత్వాలు, బోధనలు నేటి ప్రజా జీవనానికి ఎంతో ఆదర్శమని షర్మిల పేర్కొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశం. దైవం మీద నమ్మకం, మానవులందరూ ఒకటే అన్న భావానికి ప్రతీక పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు. హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీ నాయబ్-ఎ-రసూల్ నేర్పిన సూఫీ తత్వాలు, బోధనలు నేటి ప్రజా జీవనానికి ఎంతో ఆదర్శం’ అని షర్మిల పేర్కొన్నారు. కాగా, ఇదే ఉత్సవాల్లో సోమవారం ప్రముఖ సినీ నటులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Tags:    
Advertisement

Similar News