నరసాపురం అభ్యర్ధిని ఫైనల్ చేశారా?
Narasapuram YSRCP Candidate: ప్రస్తుత తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును దెబ్బకొట్టాలంటే బాపిరాజే కరెక్టు నేతని అనుకుంటున్నారట. ఎందుకంటే వీళ్ళద్దరి దగ్గరి బంధువులు, పైగా ఇద్దరి మధ్య బాగా వైరముందట. బంధు గణంలో రఘురాజు కన్నా బాపిరాజు వైపే మొగ్గు ఎక్కువుంటుందని జగన్‌కు ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం.
బాగా పాపులరైన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఫైనల్ చేశారా? ఇపుడిదే విషయంపై పార్టీతో పాటు నియోజకవర్గంలో కూడా బాగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున ఎంపీ అభ్యర్ధిగా సీనియర్ నేత కనుమూరి బాపిరాజు పోటీ చేయబోతున్నట్లు బాగా ప్రచారంలో ఉంది. సోమవారం నరసాపురం పర్యటనలో జగన్ ఇదే విషయాన్ని ఏదో రూపంలో ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. బాపిరాజు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈయన పెద్ద యాక్టివ్‌గా లేరు. అయితే చాలామంది ఇతర పార్టీల్లోకి మారినట్టు ఈయన పార్టీ మారలేదు.
ఇదే సమయంలో కాంగ్రెస్‌లో ఉండటం వల్ల ఇక లాభం లేదని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలోనే జగన్ తరపు నుండే ఆఫర్ వెళ్ళిందని చెప్పుకుంటున్నారు. బాపిరాజు అయితే నియోజకవర్గవ్యాప్తంగా మంచి యాక్సెప్టెన్సీ ఉంటుందని అనుకుంటున్నారు. అందరితోను సరదాగా మాట్లాడటం, కలివిడిగా ఉండటం, వివాదాలకు దూరంగా ఉండటం బాపిరాజుకు కలిసొచ్చే అంశాలు. పైగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు నరసాపురం ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.
అలాగే ఒకసారి తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుత తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును దెబ్బకొట్టాలంటే బాపిరాజే కరెక్టు నేతని కూడా అనుకుంటున్నారట. ఎందుకంటే వీళ్ళద్దరి దగ్గరి బంధువులు, పైగా ఇద్దరి మధ్య బాగా వైరముందట. బంధుగణంలో రఘురాజుకన్నా బాపిరాజువైపే మొగ్గు ఎక్కువుంటుందని జగన్‌కు ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం.
ఇదే సమయంలో ప్రస్తుత తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజును దెబ్బకొట్టాలంటే బాపిరాజే కరెక్టు నేతని కూడా అనుకుంటున్నారట. ఎందుకంటే వీళ్ళద్దరి దగ్గరి బంధువులు, పైగా ఇద్దరి మధ్య బాగా వైరముందట. బంధుగణంలో రఘురాజుకన్నా బాపిరాజువైపే మొగ్గు ఎక్కువుంటుందని జగన్‌కు ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. సో ఏ రకంగా చూసుకున్నా బాపిరాజు మంచి క్యాండిడేట్ అవుతారనేది జగన్ ఆలోచన. ఇదే సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీవీకే భానుపేరు కూడా పరిశీలనకు వచ్చినా బాపిరాజు వైపే మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.