తమ మద్దతు చంద్ర‌బాబుకా..? షర్మిలకా..?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని వార్తలు, కథనాలు ఇవ్వాలో అంతా ఎల్లోమీడియా ఇస్తున్నది. ఎందుకంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చంద్రబాబు వైపు మళ్ళించటానికి. చంద్రబాబుతో చేతులు కలిపిన కారణంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా బాగా ప్రాధాన్యత ఇస్తున్నది.

Advertisement
Update:2024-01-05 10:54 IST

ఎల్లోమీడియాకు పెద్ద చిక్కొచ్చిపడింది. అదేమిటంటే.. వైఎస్ షర్మిల విషయంలో ఏమిచేయాలో అర్థం కావటంలేదు. ఎందుకంటే.. మొన్నటివరకు షర్మిల తెలంగాణలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిపైన బురదచల్లేయటానికి ఆమెకు ఎల్లోమీడియా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అవసరం లేకపోయినా, అసందర్భంగా అయినా షర్మిల వార్తలకు సంబంధించి జగన్ ప్రస్తావన తెచ్చేది. తెలంగాణలో ఉన్నారు కాబట్టి అంతా చెల్లిపోయింది. అయితే ఆమె తెలంగాణను వదిలేసి తన పొలిటికల్ బేస్‌ను ఏపీకి మార్చుకున్నారు.

ఇక్కడే ఎల్లోమీడియాకు సమస్య మొదలైంది. ఎలాగంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని వార్తలు, కథనాలు ఇవ్వాలో అంతా ఎల్లోమీడియా ఇస్తున్నది. ఎందుకంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చంద్రబాబు వైపు మళ్ళించటానికి. చంద్రబాబుతో చేతులు కలిపిన కారణంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా బాగా ప్రాధాన్యత ఇస్తున్నది. అంటే జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ ఏకమయ్యారు కాబట్టి వాళ్ళకి ఎల్లోమీడియా బాగా ప్రాధాన్యత ఇస్తున్నది. జగన్ వ్యతిరేక ఓట్లన్నింటినీ టీడీపీ+జనసేన కూటమి వైపు డ్రైవ్ చేయటమే ఎల్లోమీడియా ఉద్దేశ్యం.

కానీ, ఇప్పుడు కాంగ్రెస్ తరఫున షర్మిల సడన్ ఎంట్రీ ఇవ్వటంతో ఏమిచేయాలో ఎల్లోమీడియాకు దిక్కుతోస్తున్నట్లు లేదు. షర్మిలకు మునుపటిలా ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ పార్టీకి హైప్ ఇచ్చినట్లవుతుంది. కాంగ్రెస్ పార్టీకి హైప్ ఇస్తే టీడీపీ, జనసేన కూటమికి నష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను టీడీపీ+జనసేన కూటమితో పాటు కాంగ్రెస్ వైపున‌కు తామంతట తామే మళ్ళించినట్లవుతుంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీ+జనసేన-కాంగ్రెస్ మధ్య చీలుతుంది. కాంగ్రెస్ కు పడే ప్రతిఓటు టీడీపీ+జనసేన కూటమికి నష్టమన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఇదివరకు షర్మిలకు ఇచ్చినట్లుగా ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్‌ను పాపులర్ చేస్తే చంద్రబాబుకు తమంతట తాముగా నష్టం చేసినట్లవుతుందన్నది ఎల్లోమీడియా బాధ. చంద్రబాబుతో సమానంగా ప్రాధాన్యతిచ్చి షర్మిలకు జనాల్లో పాపులారిటీ పెంచటం ఎల్లోమీడియాకు ఇష్టంలేదు. అలాగని షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జగన్ పై బురదచల్లే అవకాశాన్ని వదులుకున్నట్లవుతుంది. అంటే, షర్మిలకు ప్రాధాన్యత ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే మరో సమస్యన్నట్లుగా తయారైంది. దీంతో షర్మిల విషయంలో ఏమిచేయాలో ఎల్లోమీడియా యాజమాన్యాలకు దిక్కుతోచటంలేదు.

Tags:    
Advertisement

Similar News