పాపం పచ్చ మీడియా.. తీర్పును ప్రచురించలేక ఆపసోపాలు
చివరకు జగన్ సర్కారుకు పెద్ద ఊరటేమీ లభించలేదని కేవలం కాల పరిమితి మీద మాత్రమే సుప్రీం స్టే విధించిందని సదరు పచ్చ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇవాళ అమరావతి అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పచ్చ మీడియాకు మింగుడు పడలేదు. ఈ తీర్పుపై ఎలా వార్త ఇవ్వాలో తెలియక ఆపసోపాలు పడుతోంది. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే ఓ పత్రికలో అయితే జగన్‌కు షాక్ అంటూ వార్త రాయడం గమనార్హం. నిజానికి అమరావతిపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అమరావతిలో నిర్మాణాలపై కాలపరిమితి విధించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేయాల్సిన పనులను కోర్టులు ఆదేశిస్తే.. ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎందుకని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానింగ్ సంస్థా? కాల పరిమితి విధించడానికి అని కూడా సుప్రీం కోర్టు పేర్కొన్నది. కోర్టులే ప్రభుత్వమైతే.. ఇక క్యాబినెట్ ఎందుకని కూడా ప్రశ్నించింది. ఒకే ప్రాంతంలో రాజధానిని అభివృద్ధి చేయాలని తాము ఆదేశించలేమని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. కానీ పచ్చ మీడియాకు సుప్రీంకోర్టు తీర్పు అస్సలు నచ్చలేదు. దీంతో ఏం రాయాలో అర్థం కాక ఆపసోపాలు పడింది.
చివరకు జగన్ సర్కారుకు పెద్ద ఊరటేమీ లభించలేదని కేవలం కాల పరిమితి మీద మాత్రమే సుప్రీం స్టే విధించిందని సదరు పచ్చ మీడియాలో వార్తలు వచ్చాయి. గతంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన సందర్భంలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలువరించిన సదరు మీడియాకు ఇప్పుడు సుప్రీం కోర్టు వ్యాఖ్యానాలు ఏ మాత్రం రుచించినట్టు లేవు. దీంతో ఏం రాయాలో అర్థం కావడం లేదు.
ఇక ఈ తీర్పుపై టీడీపీ వాళ్లు ఏం మాట్లాడతారో వేచి చూడాలి. గతంలో అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పలువురు తప్పుపట్టారు. ఫలానా తారీఖులోగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించడం ఏమిటని కూడా వాపోయారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జగన్ సర్కారుకు ఊరట లభించందనే చెప్పొచ్చు.