లాయర్ల బదులు మీడియా వాదిస్తోంది!

సీఐడీ చూపించిన సాక్ష్యం దెబ్బకు చంద్రబాబు, తమ్ముళ్ళకు మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ రూ. 27 కోట్ల గురించి చంద్రబాబు, తమ్ముళ్ళు, లాయర్లు ఎవరూ నోరిప్పటంలేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లో మీడియా కౌంటర్ మొదలుపెట్టింది.

Advertisement
Update:2023-10-07 10:45 IST

స్కిల్ స్కామ్‌లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబుకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఎల్లో మీడియా పడుతున్న అవస్థ‌లు అన్నీ ఇన్నీ కావు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబే సూత్రధారని, అంతిమ లబ్ధిదారుడని సీఐడీ కొన్ని ఆధారాలను కోర్టులో చూపించింది. తాజాగా స్కామ్‌కు సంబంధించిన రూ. 371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా టీడీపీ బ్యాంకు ఖాతాకు రూ. 27 కోట్లు జమైందని సీఐడీ ఒక సాక్ష్యం చూపించింది. తన వాదనకు మద్దతుగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా జడ్జి ముందుంచింది.

సీఐడీ చూపించిన సాక్ష్యం దెబ్బకు చంద్రబాబు, తమ్ముళ్ళకు మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ రూ. 27 కోట్ల గురించి చంద్రబాబు, తమ్ముళ్ళు, లాయర్లు ఎవరూ నోరిప్పటంలేదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లో మీడియా కౌంటర్ మొదలుపెట్టింది. మాట్లాడాల్సిన చంద్రబాబు, లాయర్లు నోరిప్పకపోయినా ఎల్లో మీడియా మాత్రం చాలా తీవ్రంగా స్పందించింది. టీడీపీ ఖాతాలో పడిన రూ. 27 కోట్లు ముడపులే అయితే వైసీపీ ఖాతాలో ఉన్న రూ. 600 కోట్లు కూడా అక్రమమే అంటు విచిత్రమైన లాజిక్ మొదలుపెట్టింది.

టీడీపీకి వచ్చిన విరాళాలు, ఎలక్టోరల్ బాండ్స్ ను కూడా సీఐడీ ముడుపులుగా చెప్పటం ఏమిటని నిలదీస్తోంది. టీడీపీకి అందిన విరాళాలు, ఎలక్టోరల్ బాండ్లను ముడుపులు, అక్రమమని సీఐడీ ఎప్పుడూ అనలేదు. కాకపోతే పార్టీ బ్యాంకు ఖాతాలో ఒకేసారి పడిన రూ. 27 కోట్లకు లెక్క చెప్పమంటోంది. ఈ విషయంలో చంద్రబాబు నోరిప్పటంలేదు. రూ. 27 కోట్ల విషయంలో చంద్రబాబే నోరిప్పలేకపోతున్నపుడు ఎల్లో మీడియా ఎందుకు గోల చేస్తోందో అర్థంకావటంలేదు.

తన పార్టీ బ్యాంకు ఖాతాలో ఎక్కడెక్కడి నుండి ఎంతెంత విరాళాలు వస్తున్నాయనే దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కానీ ఎల్లో మీడియా కాదు. సీఐడీ బయటపెట్టిన రూ. 27 కోట్ల విరాళం ఎక్కడి నుండి వచ్చిందో చంద్రబాబు కోర్టులో చెబితే సరిపోతుంది కదా. ఎందుకని నోరిప్పటంలేదు? చంద్రబాబు నోరిప్పటం లేదు కాబట్టే పార్టీ లెక్కలను చూసే ఆడిటర్‌ను విచారించబోతున్నట్లు సీఐడీ కోర్టుకు చెప్పింది. దానిపైన కూడా ఎల్లో మీడియా నానా రచ్చ చేస్తోంది. అంటే స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పీకల్లోతు కూరుకుపోతున్నారనే విషయం ఎల్లో మీడియాకు అర్థ‌మైపోతోందా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.


Tags:    
Advertisement

Similar News