టీడీపీ, జనసేనకు ఎల్లోమీడియా సర్టిఫికేటా..?

ఈ ఆందోళనతోనే కాపులు మొదటినుండి టీడీపీ, జనసేనకు అండగా నిలుస్తున్నారంటూ తప్పుడు రాతలు రాసింది. కాపులు ఎప్పుడూ ఒకపార్టీల‌కు మద్దతుగా నిలబడలేదు.

Advertisement
Update:2023-01-07 11:52 IST

కాపులు మొదటి నుంచి తెలుగుదేశంపార్టీ, జనసేనకే అండగా ఉన్నట్లు ఎల్లోమీడియా సర్టిఫికెట్ ఇచ్చేసింది. అలాంటి కాపు సామాజికవర్గాన్ని పై రెండు పార్టీలకు దూరం చేయటం కోసమే బీఆర్ఎస్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తోందని తేల్చేసింది. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కూడా మీడియా సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన ఓట్లను చీల్చటానికే బీఆర్ఎస్ ఏపీలో పోటీచేస్తోందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎంట్రీ విషయంలో జోగయ్య ఆందోళన వ్యక్తంచేయటంలో అర్థ‌ముంది.

ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సీఎం అయిపోవాలన్నది జోగయ్య కోరిక. పవన్ లాగే ఈయనకు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం ఉండదు. తమ కోరికలను జనాలందరి కోరికగా వీళ్ళు చెప్పేస్తుంటారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాపులంతా జనసేనకు ఓట్లేసేసి అధికారంలోకి తెచ్చేయటానికి రెడీగా ఉన్నారనే భ్రమలో ఉన్నారు జోగయ్య. ఎల్లోమీడియా కూడా దాదాపు ఇదే భ్రమలో ఉన్నది. అందుకనే తమ కలలకు బీఆర్ఎస్ గండికొడుతోందన్న ఆందోళన వీరిలో పెరిగిపోతోంది.

ఈ ఆందోళనతోనే కాపులు మొదటినుండి టీడీపీ, జనసేనకు అండగా నిలుస్తున్నారంటూ తప్పుడు రాతలు రాసింది. కాపులు ఎప్పుడూ ఒకపార్టీల‌కు మద్దతుగా నిలబడలేదు. కాపు ప్రముఖులు ఎవరిష్టం వచ్చినపార్టీలో వాళ్ళున్నారు. కాపుల్లో మెజారిటీ నేతలు సామాజికవర్గం పరంగా కాకుండా వ్యక్తిగతంగా తమకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందనే చూసుకుంటున్నారు. కాబట్టే ఎవరిష్టం వచ్చిన పార్టీల్లో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటప్పుడు కాపులంతా పై రెండుపార్టీలకే అండగా ఉన్నట్లు ఎల్లోమీడియా ఎలా చెప్పగలదు..?

అధికారపార్టీలో ఎంఎల్ఏలు, ఎంపీలు, మంత్రులు, ఎంఎల్సీలుగా చాలామంది కాపు ప్రముఖులున్నారన్న విషయం ఎల్లోమీడియా మరచిపోయింది. నిజంగానే కాపులు జనసేనకు అండగా ఉండటమే వాస్తవమైతే పవన్ పోటీచేసిన భీమవరం, గాజువాకలో ఎందుకు ఓడిపోయినట్లు..? రెండు నియోజకవర్గాల్లోనూ కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్న విషయాన్ని సర్వేలో తెలుసుకునే కదా పోటీచేసింది. ఇక్కడ సమస్య ఏమిటంటే.. బీఆర్ఎస్ ఎంట్రీతో ఓట్లు చీలితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతారనే భయం పెరిగిపోతోంది. దీన్ని కప్పి పుచ్చుకునేందుకే బీఆర్ఎస్ పై వ్యతిరేకంగా కథనాలు మొదలయ్యాయి.

Tags:    
Advertisement

Similar News