సిట్ దర్యాప్తుని ప్రభావితం చేసేలా ఎల్లో మీడియా కథనాలు..

నిజానిజాలు తేల్చాల్సింది సిట్, కానీ ఎల్లో మీడియా ముందుగానే రెచ్చిపోతోంది. రెచ్చగొట్టేలా, దర్యాప్తుని ప్రభావితం చేసేలా కథనాలు వండి వారుస్తోంది.

Advertisement
Update:2024-05-18 07:12 IST

ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన అల్లర్లపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని, ఏపీ డీజీపీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 13 మంది సభ్యులతో ఈ టీమ్ తమ పని మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. IPS అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ పనిచేస్తుంది. అయితే సిట్ రంగంలోకి దిగేలోగా ఎల్లో మీడియా తన పని మొదలు పెట్టింది. సిట్ దర్యాప్తుని ప్రభావితం చేసేలా కథనాలు వండి వారుస్తోంది.

పేర్లతో సహా..

పల్నాడు అల్లర్లు ఎవరి పని అని తేల్చాల్సిన బాధ్యత సిట్ ది. కానీ ఎల్లో మీడియా మాత్రం అల్లర్లకు కారణం ఎవరో పేర్లతో సహా కథనాలిస్తోంది. టీడీపీకి అనుకూలంగా లేని పోలీసుల జాబితాతో వార్తలు అచ్చు వేసింది. పల్నాడు డీఎస్పీ, గురజాల డీఎస్పీ సహా.. మరికొందరు అధికారుల పేర్లు ఆ జాబితాలో చేర్చింది. వారందరికీ కఠిన శిక్షలు పడాలంటూ తానే తీర్పులిచ్చేస్తోంది ఎల్లో మీడియా.

ఏపీ పోలీసుల పరిస్థితి ఈసారి మరీ దారుణంగా తయారైంది. పోలీసులు వైసీపీకి కొమ్ముకాశారంటూ టీడీపీ ఆరోపిస్తోంది, కాదు కాదు టీడీపీతోనే అంటకాగారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అసలు పోలీసులు ఎవరివైపు స్టాండ్ తీసుకున్నారు..? ఏయే తప్పులు చేశారు అనేది తేలాల్సి ఉంది. పోలీసుల అండతో రెచ్చిపోయింది ఏ పార్టీ వారు అనేది కూడా బయటకు రావాల్సి ఉంది. ఈలోగా తామే బాధితులం అంటూ రెండు పార్టీల వారు చెబుతున్నారు, ప్రత్యర్థి వర్గమే దాడి చేసిందని అంటున్నారు. నిజానిజాలు తేల్చాల్సింది సిట్, కానీ ఎల్లో మీడియా ముందుగానే రెచ్చిపోతోంది. రెచ్చగొట్టేలా, దర్యాప్తుని ప్రభావితం చేసేలా వార్తలు రాస్తోంది. 

Tags:    
Advertisement

Similar News