వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్

పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Advertisement
Update:2024-11-08 18:21 IST

కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు నుంచి తెలంగాణలో పాలమూరు జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. రెండు రోజుల క్రితం వర్రా రవీంద్రారెడ్డిని కడప పోలీసులు అరెస్ట్ చేసి 41-ఏ నోటీసులిచ్చి వదిలేశారు. అతడిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్‌, బెంగళూరుతో పాటు కమలాపురం, పులివెందుల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.

వర్రా రవీందర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోం శాఖ మంత్రి అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్‌ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపై సోషల్‌ మీడియాలో అత్యంత హేయంగా, జుగుప్సాకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ వర్రా రవీంద్రారెడ్డిపైనా 30 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News