రానురానంటూనే చిన్నదో.. విజయసాయి ర్యాగింగ్..

అసెంబ్లీకి వచ్చి ఓటు వేయడాన్ని తప్పుపట్టలేదు కానీ, చంద్రబాబుకి మాత్రం ఓ క్లారిటీ వచ్చిందని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.

Advertisement
Update:2022-07-18 20:40 IST

చంద్రబాబు, లోకేష్ కి శాపనార్థాలు పెట్టాలంటే దానికి కొడాలి నానిని మించినవారు లేరంటారు. అదే కాస్త సెటైరిక్ గా పంచ్ లు వేయాలంటే మాత్రం విజయసాయిరెడ్డే కరెక్ట్. అందులోనూ ఆయన వేసే ట్వీట్లు ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా మరోసారి విజయసాయిరెడ్డి, చంద్రబాబుని ర్యాగింగ్ చేశారు. సీఎం అయ్యే వరకు అసెంబ్లీకి రాను అని ఒట్టు పెట్టుకున్న బాబు, దాన్ని ఇప్పుడు తీసి కరకట్ట గట్టున పెట్టేశారని ఎద్దేవా చేశారు.

గతంలో అసెంబ్లీలో తనకు, తన కుటుంబానికి అవమానం జరిగిందని, చంద్రబాబు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సన్నివేశాన్ని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. అంతకు ముందు అసెంబ్లీలో చంద్రబాబు ఓ సవాల్ విసిరారు. తాను తిరిగి సీఎం అయ్యే వరకు అసెంబ్లీ గడప తొక్కనని శపథం చేశారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు సహా మిగతా ఎమ్మెల్యేలు కూడా తామూ అసెంబ్లీకి రాబోమని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అండ్ కో రాష్ట్రపతి ఎన్నికల కోసం అసెంబ్లీకి వచ్చి ఓటేశారు. ఇదెక్కడి లాజిక్ అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఓటు వేసిన సన్నివేశాన్ని, గతంలో ఆయన మీడియా ముందు ఏడ్చిన సన్నివేశాన్ని కలుపుతూ ఓ ఫన్ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాను రానంటూనే చిన్నదో.. చిన్నదో.. అనే తెలుగు సినిమా పాటను జత చేశారు.


"సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడపతొక్కనని మంగమ్మ శపథం చేశాడు..ఆ ఒట్టు తీసి కరకట్ట గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓట్ వేశాడు బాబు. ఇక సీఎం కాలేనన్న క్లారిటీ ఆయనకుంది. పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోంది." అని ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.

అసెంబ్లీకి వచ్చి ఓటు వేయడాన్ని తప్పుపట్టలేదు కానీ, చంద్రబాబుకి మాత్రం ఓ క్లారిటీ వచ్చిందని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. ఇక తాను సీఎం కాలేనని క్లారిటీ రావడం వల్లే సీఎం కాకుండానే చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. మొత్తమ్మీద ఈ రోజు చంద్రబాబు ఓటు వేసి అనుకోకుండా ఇలా విజయసాయిరెడ్డికి బుక్ అయ్యారు.

Tags:    
Advertisement

Similar News