పుల్లారావు 20 కోట్ల లంచం అడిగారు- వైసీపీ ఎమ్మెల్యే

చంద్రబాబు తన ఇంటికి మనుషులను పంపించి వైసీపీని వీడి టీడీపీలో చేరితే టెక్స్‌టైల్ పార్కును కొనసాగిస్తామని లేకుంటే రద్దు చేస్తామని చెప్పారన్నారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.

Advertisement
Update:2022-09-16 17:42 IST

అసెంబ్లీలో వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కీలక విషయం చెప్పారు. టీడీపీ అధికారంలో ఉండగా 20 కోట్ల రూపాయల లంచాన్ని అప్ప‌టి మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారని వివరించారు. టెక్స్‌టైల్ పార్కు కోసం కాంగ్రెస్ హయాంలో బిడ్ ఆహ్వానించగా తాను గెలుచుకున్నానని, 108 ఎకరాల భూమిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ కూడా చేసి అప్పగించిందన్నారు. ఇంతలో టీడీపీ ప్రభుత్వం రావడంతో టెక్స్‌టైల్ పార్కు విషయంలో పుల్లారావు లంచం డిమాండ్ చేశారని బ్రహ్మనాయుడు వివరించారు.

పార్కుకు కేంద్రం నుంచి వచ్చిన 40 కోట్ల సబ్సిడీలో 20 కోట్ల రూపాయలు లంచంగా తనకు ఇస్తేనే టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు సాధ్యమవుతుందని పుల్లారావు బెదిరించారని బ్రహ్మనాయుడు వెల్లడించారు. లంచం ఇచ్చేందుకు తాను అంగీకరించకపోవడంతో టెక్స్‌టైల్ పార్కును రద్దు చేయాల్సిందిగా మరుసటి రోజే ధూళిపాళ్ల నరేంద్ర చేత ప్రభుత్వానికి లేఖ రాయించారన్నారు.

ఆ వెంటనే చంద్రబాబు తన ఇంటికి మనుషులను పంపించి వైసీపీని వీడి టీడీపీలో చేరితే టెక్స్‌టైల్ పార్కును కొనసాగిస్తామని లేకుంటే రద్దు చేస్తామని చెప్పారన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పగా తనకు రిజిస్ట్రేషన్ అయిన భూమిని రద్దు చేశారని వెల్లడించారు. ఇలాంటి పనులు కారణంగానే టీడీపీ హయాంలో పరిశ్రమలు పారిపోయాయన్నారు.

Tags:    
Advertisement

Similar News