సీ ఓటర్‌ సర్వే కాదు.. అది టీడీపీ పెయిడ్ సర్వే

ఇదే సంస్థ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాటి అధికార పార్టీ అయిన టీడీపీకి 14 ఎంపీ స్థానాలు, 100ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని వెల్లడించింది. తీరా ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి 3 ఎంపీ, 23 ఎమ్మెల్యే స్థానాలు రాగా.. వైసీపీకి 151ఎమ్మెల్యే స్థానాలు, 23 ఎంపీ స్థానాలు వచ్చాయి.

Advertisement
Update:2024-02-09 11:55 IST

ఎన్నికలు సమీపిస్తోన్నవేళ‌ పలు సంస్థలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా సర్వేలు నిర్వహించడం సర్వసాధారణం.. కొన్ని సంస్థలు అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా, మరికొన్ని సంస్థలు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా సర్వే ఫలితాలను వెల్లడిస్తాయి. ఏ సంస్థ సర్వే నిర్వహించినా సదరు సంస్థ విశ్వసనీయత ఆధారంగా ఇటు రాజకీయ నేతలు కానీ అటు సామాన్యులు, విశ్లేషకులు ఆ ఫలితాలను నమ్ముతారు. తాజాగా ఏపీలో మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికలకి సంబంధించిన ప్రముఖ సీ ఓటర్‌ అనే సంస్థ ఏపీలో పార్లమెంట్ ఎన్నికలపై మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో అధికార పార్టీ అయిన వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు, ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి 17 లోక్‌సభ స్థానాలు వస్తాయని తెలిపింది. ఇదే సంస్థ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాటి అధికార పార్టీ అయిన టీడీపీకి 14 ఎంపీ స్థానాలు, 100ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని వెల్లడించింది. తీరా ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి 3 ఎంపీ, 23 ఎమ్మెల్యే స్థానాలు రాగా.. వైసీపీకి 151ఎమ్మెల్యే స్థానాలు, 23 ఎంపీ స్థానాలు వచ్చాయి. అప్పటి నుండి సర్వేల పేరుతో సీ ఓటర్‌ వెల్లడిస్తున్న ఏ ఒక్క సర్వే ఫలితాలు నిజం కాలేదు.

తాజాగా గతేడాది మధ్యప్రదేశ్‌లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల‌పై ఫ్రీ పోల్స్.. ఎగ్జిట్ పోల్స్ పేరుతో సర్వేలు నిర్వహించింది సీ ఓటర్‌ సంస్థ. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 118 - 130 స్థానాలు వస్తాయని ఫ్రీ పోల్స్‌ పేరుతో ఒకసారి.. మరోకసారి ఎగ్జిట్ పోల్స్‌ నిర్వహించి కాంగ్రెస్ కి 113 -137 స్థానాలు వస్తాయని వెల్లడించింది. తీరా ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆ సర్వే ఫలితాలకు దరిదాపుల్లో లేకుండా కాంగ్రెస్‌కు కేవలం 66 స్థానాలనే కట్టబెట్టి బీజేపీకి 163 స్థానాలతో అధికారాన్ని అప్పగించారు. మరోవైపు చత్తీస్‌ఘ‌డ్‌లో ఇదే విధంగా ఫలితాలను వెల్లడించి సీ ఓటరు సంస్థ కంగుతింది. అందుకే తాజాగా సీ ఓటర్‌ నిర్వహించిన సర్వే అంతా బోగస్.. కేవలం టీడీపీని హైప్ చేయడానికే ఇలా సర్వేలంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఇటు వైసీపీ నేతలు.. అటు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News