బీజేపీ పెద్దలు టీడీపీ ట్రాప్‌లో పడ్డారు - వైవీ సుబ్బారెడ్డి
ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏపీకి మోడీ ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు చేసుకుంటే బాగుంటుందన్నారు. టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన వ్యక్తుల మాటలనే అమిత్ షా పలకడం దారుణమన్నారు.
ఏపీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ బీజేపీ సభలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీడీపీ ట్రాప్‌లో బీజేపీ పెద్దలు పడినట్టుగా కనిపిస్తోందన్నారు. చిత్తశుద్దితో నడుస్తున్న ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. 2014-19 మధ్య ఏపీలో దోపిడీ జరిగిందని, ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉందని గుర్తుచేశారు.
ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏపీకి మోడీ ప్రభుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పి అప్పుడు బీజేపీ ఉత్సవాలు చేసుకుంటే బాగుంటుందన్నారు. టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన వ్యక్తుల మాటలనే అమిత్ షా పలకడం దారుణమన్నారు. 2014లో ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఒక్క మాట మాట్లాడకుండా 20 ఎంపీ సీట్లు ఇవ్వాలని ఎలా కోరుతారని ప్రశ్నించారు. టీడీపీ- బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ, అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.