ద్రౌపది ముర్ము పేరు ప్రతిపాదించింది చంద్రబాబేనా..?

కొన్నాళ్ల తర్వాత బాబు మరో మాట కూడా మాట్లాడతారంటూ ముందే అంచనా వేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.

Advertisement
Update:2022-07-14 19:31 IST

హైటెక్ సిటీ కట్టింది నేనే, అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది నేనే.. అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబు వల్లెవెసే డైలాగులివి. కొన్నాళ్ల తర్వాత బాబు మరో మాట కూడా మాట్లాడతారంటూ ముందే అంచనా వేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రపతిగా అప్పట్లో ద్రౌపది ముర్ము పేరు ప్రతిపాదించింది కూడా తానేనని చెప్పుకుంటారని సెటైర్లు వేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి వైసీపీ మద్దతు తెలిపితే, బీజేపీకి లొంగిపోయారంటూ టీడీపీ నేతలు విమర్శించారు. చివరి నిముషంలో టీడీపీ మద్దతు తెలిపితే మాత్రం అది చంద్రబాబు చాణక్యం అంటున్నారు. టీడీపీ కామెంట్లపై విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్లు వేశారు.

"చంద్రం ఏం చేసినా పచ్చ కుల మీడియాకు అది చాణక్యమే! ఎందరి కాళ్లు పట్టుకున్నదీ, ఎంత లాబీయింగ్ చేసిందీ అందరికీ తెలుసు. పొర్లుదండాలు పెట్టి ప్రాధేయపడ్డాడు కాబట్టే ద్రౌపది ముర్ము గారు మర్యాద పాటించారు. కొన్నాళ్ల తర్వాత ఆమె పేరు ప్రతిపాదించింది నేనే అని కథలు మొదలెడతాడు." అంటూ ట్వీట్ వేశారు విజయసాయి రెడ్డి.

ఈ వరదల్లో చంద్రబాబు సీఎంగా ఉంటే..?

"ప్రజలు శని వదిలించుకున్నారు గానీ..ఈ వరదల టైములో మెంటల్ బాబ్జీ ఉంటే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తిష్టవేసి గంటగంటకు వాటర్ లెవల్ కొలిచేవాడు. వరదలను కంట్రోల్ చేసినట్టు ఎల్లో మీడియాలో బిల్డప్పులుండేవి. అధికారులను పని చేసుకోనివ్వకుండా మందలింపులు, ఫ్లడ్ మాన్యువల్ చదవాలని హెచ్చరించే వాడు." అంటూ ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి.

సింగపూర్ లో హోటల్ ఎందుకు కొన్నారంటే..?

"ఇక్కడ తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసి - అక్కడ ఓ హోటల్ కొనుక్కున్నాడు. ఒక ప్రైవేట్ జెట్ రెడీగా పెట్టుకున్నాడు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ లాగా 2024 తర్వాత ఈ 'గొట్టం బాబు'కీ అదే పరిస్థితి. ఇద్దరిదీ చివరి మజిలీ సింగపూరే." అంటూ చంద్రబాబు ఫ్యూచర్ ఇలా ఉంటుందని సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి.

చివరిగా సర్వేపై ఇలా స్పందించారు..

"జగన్ గారి ప్రజాదరణ చూసి చంద్రబాబు, పచ్చ కుల మీడియా వెన్నులో వణుకు పుట్టి ఢిల్లీలో టీడీపీ జీతగాళ్లతో ఫేక్ సర్వేలు చేపించి జనం మీదకు వదులుతున్నారు. పాతాళానికి చేరిన చంద్రబాబు గ్రాఫ్ పెంచలేకే ఫేక్ సర్వేలు మొదలెట్టారు. పీకేసిన సీఎంకి మూడో స్థానమిచ్చినప్పుడే మీ స్థాయేంటో అర్ధమైందర్రా!" అంటూ సీఎంల పనితీరుపై చేసిన సర్వేపై విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News