కోర్టుకెళితే ఫలితం ఉంటుందా?

సజ్జల చెప్పిందాని ప్రకారం ఓట్ల లెక్కింపులో బాగా అవకతవకలు జరిగాయిట. ఇతరుల ఓట్లను టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ చౌదరి ఖాతాలో వేసినట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని తాము 8వ రౌండ్లోనే చెబితే కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత చెప్పాలని రిటర్నింగ్ అధికారి అన్నట్లు సజ్జల చెప్పారు.

Advertisement
Update:2023-03-20 10:29 IST

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై వైపీపీ కోర్టులో కేసు వేయబోతోందా? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలు విన్నతర్వాత అందరూ ఇదే అనుకుంటున్నారు. సజ్జల చెప్పిందాని ప్రకారం ఓట్ల లెక్కింపులో బాగా అవకతవకలు జరిగాయిట. ఇతరుల ఓట్లను టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ చౌదరి ఖాతాలో వేసినట్లు ఆరోపించారు. ఈ విషయాన్ని తాము 8వ రౌండ్లోనే చెబితే కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత చెప్పాలని రిటర్నింగ్ అధికారి అన్నట్లు సజ్జల చెప్పారు.

కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ విషయాన్ని ప్రస్తావిస్తే రిటర్నింగ్ అధికారి స్పందించలేదని మండిపడ్డారు. ఇతరుల ఓట్లను టీడీపీ అభ్యర్థి ఖాతాలో వేసిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించినా రిటర్నింగ్ అధికారి ఎందుకు పట్టించుకోలేదో తమకు అర్థ‌కావటంలేదన్నారు. కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని సజ్జల ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇక్కడ విషయం ఏమిటంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నిక‌లు జ‌రిగాయి. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి నిబంధనలు అమలులో ఉన్నంతవరకు అధికార యంత్రాంగమంతా కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఆ తర్వాత మామూలుగానే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేస్తారు. ఈ విషయం బాగా తెలిసిన ప్రభుత్వ అధికారులు కౌంటింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయని అధికార పార్టీ చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? కౌంటింగ్‌పై ఎన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసినా ఎందుకని పరిశీలించలేదు?

ఎన్నికల విధుల్లో ఉన్నవారంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే అయినా అధికార పార్టీ అభ్యంతరాలను ఎందుకని లెక్కచేయలేదు? అనేది కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నలకు సజ్జల ఆరోపణల్లోనే సమాధానాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా పొరబాటున పదో ఇరవయ్యే ఓట్లు తప్పుగా లెక్కబెట్టి ఉండచ్చు. అంతేకానీ సజ్జల ఆరోపిస్తున్నట్టుగా ఇతరులకు పడిన వేల ఓట్లను టీడీపీ ఖాతాలో వేసే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి. కౌంటింగ్‌లో ఉద్దేశ‌పూర్వకంగా తప్పు చేస్తే ఎన్నికల ప్రక్రియ తర్వాత తమకు ఇబ్బందులు తప్పవని తెలిసీ ఉద్యోగులు ఎవరైనా తప్పు చేస్తారా?

Tags:    
Advertisement

Similar News