ప్రత్యేక హోదా రేసులోకి మరో రాష్ట్రం!
ప్రత్యేకహోదా విషయంపై ఆల్ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్.
కేంద్ర బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్ మళ్లీ ఊపందుకుంటోంది. తాజాగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో అధికార NDA కూటమి పార్టీలతో పాటు కూటమిలో లేని పార్టీలు సైతం తమతమ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అధికార NDA కూటమిలో ఉన్న జేడీయూ బిహార్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లోనూ మరోసారి తన డిమాండ్‌ను రాజ్‌నాథ్ సింగ్ ముందు పెట్టింది జేడీయూ. ఈ డిమాండ్‌కు ప్రతిపక్ష RJD సైతం మద్దతు పలికింది. స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు ఏవైనా నిబంధనలు అడ్డుపడితే బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాలని జేడీయూ, RJD ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఈ సమావేశంలో వైసీపీ డిమాండ్ చేసింది. ప్రత్యేకహోదా విషయంపై ఆల్ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. ప్రత్యేక హోదా అంశం టీడీపీ మౌనం వహించడం విచిత్రంగా ఉందన్నారు. NDA కూటమిలో ఉన్న జేడీయూ బిహార్‌కు స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తుండగా.. టీడీపీ మౌనంగా ఉండడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.
ప్రత్యేక హోదా రేసులోకి బిహార్, ఏపీతో పాటు ఇప్పుడు ఒడిశా కూడా వచ్చి చేరింది. ఆల్ పార్టీ మీటింగ్‌లో బిజూ జనతా దళ్ ఎంపీ ఒడిశాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల టైంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ఒడిశాకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని.. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.