మాధవ్‌ పక్కన నా ఫొటో పెట్టి క్షోభ పెట్టారు- అనితారెడ్డి ఫిర్యాదు

టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులను మాధవ్‌తో మాట్లాడింది తానే అంటూ తన ఫొటోలతో సహా ప్రచారం చేసి, క్షోభకు గురిచేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐకు ఫిర్యాదు ఇచ్చారు.

Advertisement
Update:2022-08-08 09:50 IST

వీడియో కాల్‌ ద్వారా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపించిన వీడియోలో ఉన్న మహిళ ఎవరన్న దానిపై వివరాలు బయటకు రాలేదు. అయితే కొందరు నెటిజన్లు ఆ వీడియో కాల్‌లో మాట్లాడింది వైసీపీ కార్యకర్త అనితారెడ్డే అంటూ సోషల్ మీడియాలో ఆమె ఫొటోను వైరల్ చేశారు. కావాలంటే ఆమె ప్రొఫైల్ పిక్చర్‌... మాధవ్‌ వీడియో కాల్‌లోని మహిళ ఫొటో చూసినా ఆ విషయం అర్థమవుతుందంటూ ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త అనితారెడ్డి అనంతపురం జిల్లా గాండ్లపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులను మాధవ్‌తో మాట్లాడింది తానే అంటూ తన ఫొటోలతో సహా ప్రచారం చేసి, క్షోభకు గురిచేశారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐకు ఫిర్యాదు ఇచ్చారు.

సత్యసాయి జిల్లా గాండ్లపెంటకు చెందిన అనితారెడ్డి భర్తతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. నాలుగేళ్లుగా తాను వైసీపీ అభిమానిగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నానని.. టీడీపీ వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని కూడా ఆమె చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా తన ఫొటోను గోరంట్ల మాధవ్ పక్కన పెట్టి ఆత్మ క్షోభకు గురి చేశారని తన ఫిర్యాదులో వివరించారు. మొత్తం ఐదుగురిపై ఆమె కేసు పెట్టారు.

అయితే తన ట్విట్టర్‌ ఖాతాలో అనితారెడ్డి కూడా ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులను, ఇతర ప్రజాప్రతినిధులను అనుచిత పదాలతో దూషిస్తూ పెట్టిన ట్వీట్లు కూడా ఉన్నాయి. గతంలో ఈమెకు రఘురామకృష్ణంరాజుకు మధ్య కూడా వివాదం నడిచింది. విగ్గురాజు అంటూ రఘురామకృష్ణంరాజుకు తాను వాట్సాప్‌లో పెట్టిన మేసేజ్‌ను ఇప్పటికీ ఆమె తన టైం లైన్‌ మీద అలాగే ఉంచుకున్నారు.

Tags:    
Advertisement

Similar News